30 Years Industry Prudhvi Raj: సినీ నటుడు, జనసేన నాయకుడు పృథ్వీరాజ్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆయన సోమవారం ఉదయం విఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మొక్కులు కూడా చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ” స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి వస్తున్న వార్తలు ఖండించిన పృథ్వీరాజ్
పవన్ కళ్యాణ్ దగ్గరికి దూతల పంపించారని అని చెప్పడం అంతా పబ్లిసిటీ స్టంట్ అని అన్నారు. పవన్ కు, కేసీఆర్ డబ్బులు పంపించాడని వస్తున్న వార్తలో నిజం లేదని, కేసీఆర్ గారికి ఏమన్నా డబ్బులు ఏమైనా ఊరికే దొరుకుతున్నాయా, అయినెందుకు పంపిస్తాడు అని ప్రశ్నించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గురించి పృథ్వీరాజ్ పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు.
Akkineni Nagarjuna: ఆ రీమేక్ పైనే నాగ్ ఆశలన్నీ.. వర్క్ అవుట్ అయ్యేనా..?
“నాకు అప్పట్లో 200 కోట్లు పంపించారని ప్రచారం చేశారు.. ఆ డబ్బులు లెక్కేట్టుకోవడానికి ఇన్ని రోజులు పట్టి ఇప్పుడు వచ్చాను తిరుమలకి.. నరం లేని నాలుక వంద మాట్లాడుతుంది. టాక్స్ కట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ 9 కోట్లు అప్పు చేశాడు. అంత మంచి మనిషి పవన్ కళ్యాణ్. జనం కోసం పుట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్.. అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం తప్పు. ఆయనెప్పుడు జనంలోనే ఉంటారు.. జనం ఎప్పుడు పవర్ స్టార్ తోనే ఉంటారు” అని చెప్పుకొచ్చారు. ఇక పవన్ తో ఆలీ పోటీ గురించి మాట్లాడుతూ.. ” ఈ మధ్యన ఒక తాను పవన్ కళ్యాణ్ తో ఫొటో దిగి.. ఆయనే నాతో ఫోటో దిగినట్లు ఉంది అని చెప్పుకొచ్చాడు. అలా ఉంది అలీ పోటీ చేస్తాను అని చెప్పడం.. స్థాయి చూసుకోవాలి కదా మనం” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.