తగ్గేదే లే… దుమ్ము దులుపుతున్న “దాక్కో దాక్కో మేక” సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్న్”పుష్ప” నుంచి రీసెంట్ గా విడుదలైన “దాక్కో దాక్కో మేక” సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము దులుపుతోంది. తాజాగా ఈ సాంగ్ రికార్డు స్థాయి భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. ‘తగ్గేదే లే’ అంటూ దూసుకెళ్తున్న ఈ సాంగ్ ఐదు భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అన్ని భాషల్లో కలిపి తాజాగా 30+ మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన పాట విజువల్స్, ఎడిటింగ్ కు విశేషంగా ప్రశంసలు కురుస్తున్నాయి. విశాల్ దడ్లాని (హిందీ), విజయ్ ప్రకాష్ (కన్నడ), రాహుల్ నంబియార్ (మలయాళం), శివమ్ (తెలుగు) మరియు బెన్నీ దయాళ్ (తమిళ్) ఐదు వెర్షన్లలో సాంగ్ ను పాడారు.
Read Also : ప్రకాష్ రాజ్ @ బ్యాక్ టు వర్క్
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
ఇప్పటికే ఈ సాంగ్ 24 గంటల వ్యవధిలో అత్యధికంగా వీక్షించిన, లైక్ చేసిన టాలీవుడ్ లిరికల్ వీడియోగా సెన్సేషన్ సృష్టించింది. “దాక్కో దాక్కో మేకా” కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే 9.4 మిలియన్ వ్యూస్, 657 వేల లైక్‌లను నమోదు చేసింది. కాగా “పుష్ప” రెండు భాగాలుగా విడుదల కానుంది. అల్లు అర్జున్ లుక్, సుకుమార్ దర్శకత్వం ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేశాయి. మొదటి భాగం “పుష్ప : ది రైజ్” ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!