Site icon NTV Telugu

NaniOdela2 : నాని ‘ప్యారడైజ్’ కోసం 30 ఎకరాలలో భారీ ప్లానింగ్

Paradise

Paradise

నేచురల్ స్టార్ హీరోగా ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో నటిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ది ప్యారడైజ్ గ్లిమ్స్ కు భారీ స్పందన లభించింది. ప్రస్తుతం ది ప్యారడైజ్ షూటింగ్  శరవేగంగా జరుగుతోంది. నేచురల్ స్టార్ నానిని కెరీర్ లో మునుపెన్నడూ చుడని విధంగా చూపిస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.

Also Read : Kollywood : మిరాయ్ కి చుక్కలు చూపిస్తున్న కోలీవుడ్

కాగా ఈ సినిమా కథా నేపథ్యం 80వ దశకంలోని సికింద్రాబాద్ బ్యాడ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. నాని ఈ  సినిమాలో డ్యూయెల్ రోల్ చేయనున్నాడని టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం చిత్ర నిర్మాతలు హైదరాబాద్ శివార్లలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో భారీ మురికివాడల సెట్స్ నిర్మించనున్నారట. ఇటీవల ఈ సినిమా నుండి నేచురల్ స్టార్ నాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా భారీ స్పందన లభించింది. పక్కింటి అబ్బాయ్ లాగా ఉండే నాని రెండు పొడవాటి జడలు వేసుకుని రగ్గుడ్ లుక్ లో ‘జడల్’ గా అదరగొట్టాడు. టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దాదాపు ప్యారడైజ్ ను నాని కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ రూ. 100 కోట్లకు పైగా  ఖర్చుతో నిర్మిస్తున్నారు. తమిళ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ప్యారడైజ్ మొత్తం 8 భాషలలో రిలీజ్ కానుంది. సమ్మర్ కానుకగ వచ్చే ఏడాది మార్చి 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది ది ప్యారడైజ్.

Exit mobile version