30.25 Lakh tickets sold all over India for Salaar Advance Booking: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. నిజానికి బాహుబలి సిరీస్ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన తర్వాత ప్రభాస్ హీరోగా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఒక్క సినిమా కూడా ఆ స్థాయిలో హిట్ అవ్వలేదు. అయితే కేజిఎఫ్ సిరీస్ చేసిన ప్రశాంత్ నీ డైరెక్టర్ కావడం ప్రతిష్టాత్మక సంస్థగా పేరు తెచ్చుకున్న హోంబలే ఫిలింస్ నిర్మాణం కావడంతో ఈ సలాడ్ మీద మొదటి నుంచే అంచనాలున్నాయి. అయితే అనేక సార్లు వాయిదా పడుతూ రావడంతో కాస్త సినిమా మీద ప్రేక్షకులకు ఆసక్తి తగ్గినట్టు అనిపించినా రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సినిమా బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత బుక్ మై షో యాప్ కూడా క్రాష్ అయ్యిందంటే సినిమా మీద ప్రేక్షకులలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Pallavi Prashanth: బెయిల్ ఇవ్వండి ప్లీజ్.. నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు
ఇక నిన్న రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు ఈ సినిమాకి ఎన్ని టికెట్లు తెగాయి అనే విషయం మీద సినిమా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకి సంబంధించి నేషనల్ చైన్ మల్టీప్లెక్స్ అయినా పివిఆర్- ఐనాక్స్, సినీ పోలీస్ మినహాయించి ఇప్పటివరకు 30 లక్షల యాభైవేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఆంధ్రప్రదేశ్లో 13 లక్షల 25000, నైజాం 6 లక్షలు, నార్త్ ఇండియా 5,25,000, కర్ణాటక 3. 25 వేలు, కేరళ లో లక్షన్నర, తమిళనాడులో లక్ష మొత్తం 30 లక్షల 25 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక ఇప్పటివరకు అమ్ముడుపోయిన టికెట్ల సంఖ్య ఇదని, అడిషనల్ స్క్రీన్స్ కూడా త్వరలోనే బుకింగ్స్ ఓపెన్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ వంటి వారు ఇతర కీలక పాత్రలో నటించారు.