యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్” షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఈ మూవీ షూటింగ్ ను గత రెండేళ్లుగా సాగిదీస్తూనే ఉన్నారనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయిందని మేకర్స్ ప్రకటించడంతో మెగా అభిమానులు సంతోష పడ్డారు. కానీ మరో మూడు రోజులు సినిమాకు సంబంధించిన స్పెషల్ షూటింగ్ జరగనుందట. రేపటి నుంచి కడపలోని గండికోటలో పారంభమై మూడు రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేస్తారట. అయితే ఈ స్పెషల్ షూట్ అంతా మూవీ ఓపెనింగ్ క్రెడిట్స్ కోసమని టాక్ నడుస్తోంది. అంటే టైటిల్ కోసమన్నమాట. తాజా చిత్రీకరణలో సినిమా టీం తప్ప నటీనటులెవ్వరూ పాల్గొనరు. అయితే ఇప్పటికే నెటిజన్లు సినిమాపై సెటైర్లు పేలుస్తున్నారు. “సాహో” అంటే యాక్షన్ మూవీ కాబట్టి 2 ఇయర్స్ పట్టింది. మరి “రాధే శ్యామ్” రొమాంటిక్ ఎంటర్టైనర్ కదా… లవ్ సీన్స్ తీయడానికి రెండేళ్లు పట్టడంలో లాజిక్ లేదని ఆలోచిస్తున్నారు. ఏదేమైనా ఎంతోకాలంగా ప్రభాస్ సినిమా కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడం ఊరటనిచ్చిందనే చెప్పాలి.
Read Also : జీ చేతికి “కేజిఎఫ్-2” శాటిలైట్ రైట్స్
“రాధేశ్యామ్” డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ అండ్ లవ్ పాన్ ఇండియా మూవీ. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా 2022 జనవరి 14న థియేటర్లలో విడుదల కానుందని “రాధే శ్యామ్” బృందం ప్రకటించింది. రిలీజ్ విషయాన్ని తెలియజేస్తూ ఇటీవలే సరికొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అయిపోయారు.
