Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. స్నేహానికి ప్రాణమిస్తాడు అనేది అందరికి తెల్సిందే. బద్రి నుంచి ఇప్పటివరకు ఆలీతో పవన్ అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల వలన ఎలాంటి గొడవలు రాకూడదని పవన్ దూరంగా ఉన్నాడు. ఇక త్రివిక్రమ్- పవన్ స్నేహం గురించి అందరికి తెల్సిందే. వీరితో పాటు పవన్ స్నేహితుడు ఇంకొకరు ఉన్నారు.. అతనే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి. అదేనండీ తొలిప్రేమ సినిమాలో తాజ్ మహల్ సెట్ వేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు ఆనంద్ సాయి.. ఆ తరువాత తొలిప్రేమలో పవన్ చెల్లెలిగా నటించిన వాసుకిని వివాహమాడాడు.
ఇక ఆ సినిమా నుంచి ఇప్పటివరకు పవన్- ఆనంద్ మధ్య స్నేహ బంధం కొనసాగతూనే ఉంది. తాజాగా ఆనంద్.. ఉస్తాద్ భగత్ సింగ్ పూజా కార్యక్రమానికి హాజరయ్యాడు. పవన్.. ఎంతో చనువుగా ఆనంద్ మీద చేయి వేసి మాట్లాడుతున్నా వినయంగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఆనంద్. 25 ఏళ్ళ క్రితం వీరి స్నేహబంధం ఎలావుందో ఇప్పటికే అలాగే ఉండడంతో అభిమానులు అప్పటి ఫోటోలను.. ఇప్పటి ఫోటోలను జోడించి రియల్ ఫ్రెండ్షిప్ అంటూ ట్యాగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
