Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News 25 Years Of Parades Movie

25 Years Of Paradesh: పాతికేళ్ల షారుఖ్ ఖాన్ ‘పర్ దేశ్’

Published Date :August 8, 2022 , 6:25 am
By Subbarao N
25 Years Of Paradesh: పాతికేళ్ల షారుఖ్ ఖాన్ ‘పర్ దేశ్’
  • Follow Us :
  • google news
  • dailyhunt

పాతికేళ్ళ క్రితం షారుఖ్ ఖాన్ హవా విశేషంగా వీస్తోంది. షారుఖ్ నటించిన సినిమా వస్తే చాలు, కలెక్షన్ల వర్షం కురుస్తుందని అందరూ భావించేవారు. దక్షిణాదిన సైతం షారుఖ్ చిత్రాలు వసూళ్ళు విశేషంగా సాధించేవి. పాతికేళ్ళ క్రితం షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన ‘పర్ దేశ్’ సినిమా సైతం విజయపథంలో సాగింది. సుభాష్ ఘయ్ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘పర్ దేశ్’ సినిమా 1997 ఆగస్టు 8న విడుదల విజయభేరీ మోగించింది.

‘పర్ దేశ్’ కథ ఏమిటంటే – కిశోరీలాల్ తన కొడుకు రాజీవ్ కు తన మిత్రుని కూతురు గంగను ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. అందుకు కిశోరీలాల్ పెంచి పెద్ద చేసిన అర్జున్ ఏర్పాట్లు చేస్తుంటాడు. అయితే అతను చేసే పనులు పెళ్ళికూతురు గంగకు, ఆమె ఇంట్లోవాళ్లకు నచ్చవు. గొడవ మొదలవుతుంది.

తరువాత అర్జున్, గంగ మధ్య స్నేహం పెరుగుతుంది. రాజీవ్ వచ్చాక అతని పాశ్చాత్య పోకడలు చూసి గంగ ఆశ్చర్యపోతుంది. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన గంగకు రాజీవ్ చేష్టలు ఏ మాత్రం నచ్చవు. రాజీవ్ తనతో గంగను లాస్ వెగాస్ తీసుకు పోతాడు. అక్కడే పెళ్ళికి ముందే ఒక్కటవుదామని గంగను బలవంత పెడతాడు రాజీవ్. చీదరించుకొని వెళ్ళిపోతుంది గంగ. రాజీవ్ ఆమెను వద్దనుకుంటాడు. ఆమె పరిస్థితి చూసి అర్థం చేసుకున్న అర్జున్ సహాయపడతాడు. దాంతో గంగ, అర్జున్ తో లేచిపోయిందనీ రాజీవ్ గంగ కుటుంబసభ్యులకు చెబుతాడు.

తన తండ్రి పెంచి పెద్ద చేసిన అర్జున్, గంగకు సహకరించడం రాజీవ్ కు ఏ మాత్రం నచ్చదు. గంగను అర్జున్ వారి కుటుంబసభ్యుల దగ్గరకు చేరుస్తాడు. అర్జున్ ను చంపడానికి గూండాలనూ నియమిస్తాడు రాజీవ్. అర్జున్, రాజీవ్ కొట్టుకుంటారు. కిషన్ లాల్ కు అసలు విషయం తెలుస్తుంది. తాను గంగను ప్రేమించినా, ఏ రోజూ ఆ మాట చెప్పలేదన్న నిజాన్ని అర్జున్ చెబుతాడు. కిశోరీలాల్ కూడా గంగ తన కోడలు కావాలనుకున్నానని, అయితే రాజీవ్ భార్యగా కాదు, అర్జున్ కు ఆమెను ఇచ్చి పెళ్ళి చేయాలని అంటాడు. అర్జున్, గంగ ఒకటి కావడంతో కథ సుఖాంతమవుతుంది.

నటి మహిమాచౌధురి తొలిసారి తెరపై కనిపించిన చిత్రం ‘పర్ దేశ్’. ఇందులో అమ్రిష్ పురి, అపూర్వ అగ్నిహోత్రి, అలోక్ నాథ్, పద్మావతీ రావ్, దినా పాథక్, హిమానీ శివ్ పురి, మాధురీ భాటియా, స్మితా జయకర్, పవన్ మల్హోత్రా, ప్రాచీ సావే,ఆదిత్య నారాయణ్, సమతా సాగర్ నటించారు. ఓ పాటలో పాడుతూ సుభాష్ ఘయ్ కూడా కనిపిస్తారు. నదీమ్ -శ్రవణ్ స్వరకల్పనకు ఆనంద్ బక్షీ పాటలు రాశారు. ఇందులోని “నహీ హోనా థా…”, “మేరీ మెహబూబా…”, “యే దిల్ దీవానా…”,”ఐ లవ్ మై ఇండియా…”, “దో దిల్ మిల్ రహే హై…”, “జహా పియా వహా మై…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. 1997 బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా ‘పర్ దేశ్’ నిలచింది. ఈ సినిమా తరువాత మహిమా ఛౌదురి తెలుగులో ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ‘మనసులో మాట’లో నాయికగా నటించింది.

(ఆగస్టు 8న ‘పర్ దేశ్’కు 25 ఏళ్ళు)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 25 years of parades
  • mahima chowdary
  • movie specials
  • parades
  • Sharukh Khan

తాజావార్తలు

  • US Army Chief Fired: యుద్ధం మధ్యలో ఆర్మీ చీఫ్‌కు షాకిచ్చిన రక్షణ మంత్రి.. అమెరికా సైన్యంలో భారీ కుదుపు

  • Biker Overseas Review : శర్వానంద్ బైకర్ ఓవర్సీస్ రివ్యూ

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions