25 Years for Victory Venkatesh’s Ganesh Movie: విక్టరీ వెంకటేశ్ ఎన్ని మాస్ మసాలా సినిమాల్లో నటించినా, ఆయనకు ‘ఫ్యామిలీ హీరో’ అనే ఇమేజ్ మాత్రమే దక్కింది. వెంకటేశ్ పవర్ ఫుల్ జర్నలిస్ట్ రోల్ లో కనిపించిన ‘గణేశ్’లో అన్నిమాస్ హంగులూ ఉన్నాయి. అయినా ఈ సినిమా ఆయనను విలక్షణ నటునిగానే నిలిపింది. డి.రామానాయుడు సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై తిరుపతి స్వామిని దర్శకునిగా పరిచయం చేస్తూ డి.సురేశ్ బాబు ‘గణేశ్’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా 1998 జూన్ 19న విడుదలై విజయఢంకా మోగించింది.
‘గణేశ్’ కథ విషయానికి వస్తే – జర్నలిస్ట్ గణేశ్, అతని స్నేహితురాలు దివ్య ఎంతో అన్యోన్యంగా సాగుతూ ఉంటారు. అలాగే గణేశ్ తన తండ్రి, చెల్లితో కలసి ఆనందమైన జీవితం గడుపుతూంటాడు. అన్యాయాలను అక్రమాలను వెలికి తీయడంలో ముందుంటాడు గణేశ్. ఆరోగ్య శాఖ మంత్రి సాంబశివుడు బాగోతాన్ని బయట పెడతాడు. అతను సాగిస్తున్న మెడికల్ మాఫియాను వెలికి తీస్తాడు గణేశ్. అతని వద్ద ఉన్న ఆధారాలను తనకు ఇస్తే కోరినంత ఇస్తానంటాడు సాంబశివుడు. అందుకు గణేశ్ అంగీకరించడు. దాంతో గణేశ్ కుటుంబాన్ని నాశనం చేస్తాడు. గణేశ్ ను దోషిగా నిలుపుతాడు. జైలుకు పంపుతాడు. అక్కడ నుంచే మెడికల్ మాఫియా
Adipurush: రావణుడి లుక్‌పై ట్రోలింగ్.. మైండ్ బ్లాకయ్యే సమాధానమిచ్చిన నిర్మాత!
ఆటకట్టించే ప్రయత్నం చేస్తాడు గణేశ్. తన ప్లాన్స్ ప్రకారం తనవారిని అంతం చేసిన వారిని తుదముట్టిస్తుంటాడు గణేశ్. జైలర్ ప్రియ గణేశ్ ను అనుమానిస్తుంది. జైలులో ఉంటే ఏమైనా చేస్తాడని తన ఇంటికే తీసుకు వెళ్తుంది. అతనిపై మనసూ పారేసుకుంటుంది ప్రియ. అయినా గణేశ్ తాను చేయదలచుకున్నది చేస్తాడు. గణేశ్ కు అతని స్నేహితురాలు దివ్య సహకరిస్తూ ఉంటుంది. చివరకు సాంబశివుడు చేసిన ఘోరాలను బయటపెట్టి అతణ్ణి అంతమొందిస్తాడు గణేశ్. ఈ కథను తిరుపతి స్వామి నడిపిన తీరు ఆకట్టుకుంది.
ఇందులో వెంకటేశ్, రంభ, మదుబాల, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, కీర్తన, రామానాయుడు, రేవతి, జయప్రకాశ్ రెడ్డి, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, పద్మనాభం, బ్రహ్మానందం, ఆలీ, బాబూమోహన్, వేణుమాధవ్, గుండు హనుమంతరావు, అశోక్ కుమార్, బెనర్జీ, జీవా, నరసింగ్ యాదవ్, బండ్ల గణేశ్, పి.యల్.నారాయణ, నరసింహరాజు, రమాప్రభ, తెలంగాణ శకుంతల, రాగిణి తదితరులు నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం తిరుపతి స్వామ నిర్వహించగా, పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు. మణిశర్మ బాణీలకు అనువుగా వేటూరి, సిరివెన్నెల, భువనచంద్ర, చంద్రబోస్ పాటలు పలికించారు.
Raashii Khanna: అందాల ‘రాశి’ హీటెక్కించి చంపేస్తోందే!
“ఆదా బర్సే అందరికీ ఆదాబర్సే…”, “హిందీలోన చుమ్మా…”, “రాజహంసవో రాత్రిహింసవో…”, “సిరి సిరి మువ్వలు…”, “అయ్యో రామ…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఇందులో కోట శ్రీనివాసరావు విలక్షణమైన అభినయంతో ఆకట్టుకోగా, పైకి కనిపించే ఆయన గెటప్, అది తీసేశాక కనిపించే వికృతరూపం రెండింటా తనదైన బాణీ పలికించారు. ఈ చిత్రం ఐదు నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ తృతీయ చిత్రంగా నందిని పొందటమే కాదు… ఉత్తమ నటునిగా వెంకటేశ్, ఉత్తమ విలన్ గా కోట శ్రీనివాసరావు, ఉత్తమ రచయితలుగా పరుచూరి బ్రదర్స్, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా రాఘవ నంది అవార్డులు అందుకున్నారు. శతదినోత్సవాలు చూసిందీ సినిమా.