Site icon NTV Telugu

Dhanush: రెండు దశాబ్దాలు .. ‘సార్’ మీ జర్నీ సూపర్

Dhanush

Dhanush

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్  గురించి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఒక్క కోలీవుడ్ లోనే కాదు అన్ని భాషల్లోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన హీరోల్లో ధనుష్ ఒకడు. కథ  డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. పాత్ర ఏదైనా ధనుష్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక రజినీకాంత్ అల్లుడిగా ఆయన స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ హీరో తన కెరీర్ స్టార్ట్ చేసి 20 ఏళ్ళు పూర్తయ్యాయి. 2002 లో  ‘తుల్లు వాదో ఇమ్మాయ్` అనే సినిమాతో కోలీవుడ్ లో నటుడిగా పరిచయం అయ్యాడు ధనుష్.

ఇక ఈ సందర్భంగా అభిమానులకు థాంక్స్ చెప్తూ ఎమోషనల్ నోట్ పోస్ట్ చేశాడు. ఈ నోట్ లో అభిమానులతో పాటు తన తల్లిదండ్రులకు, అన్న సెల్వరాఘవన్ కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ధనుష్ రెండు దశాబ్దాల జర్నీకి శుభాకాంక్షలు చెప్తూ  `సార్` ఫస్ట్ లుక్ పోస్టర్ ని  రిలీజ్  చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే  `వాటే జర్నీ ధనుష్` అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ధనుష్ తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ను త్వరలోనే  రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version