NTV Telugu Site icon

ARM: సినిమా పైరసీ.. ఇద్దరు అరెస్ట్!

Arm

Arm

స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్ “ARM”. టోవినో థామస్ 50 మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా నటించారు. డెబ్యుటెంట్ జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ “ARM” సెప్టెంబర్ 12న విడుదల అయింది. ఇక ఏఆర్‌ఎం సినిమా పైరేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసిన కేసులో ఇద్దరు తమిళనాడు వాసులు అరెస్ట్‌ అయ్యారు.

Bigg Boss: బిగ్ బాస్ కు షాక్ .. మహిళా కమిషన్ నోటీసులు!

కోయంబత్తూరులో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా కోయంబత్తూరులోని ఓ థియేటర్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరిగినట్లు తెలిసింది. ఇక వీరిని కొచ్చి సైబర్ పోలీసులు విచారిస్తున్నారు. ARM ఇటీవలి కాలంలో థియేటర్లలో రిలీజ్ అయిన అతిపెద్ద మలయాళ చిత్రం. తన కెరీర్‌లో 50వ చిత్రంలో అజయన్, మణియన్, కుంజికేలు అనే మూడు పాత్రల్లో టోవినో కనిపించాడు. సెప్టెంబర్ 12న ఓనమ్ సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఇక ఇంకా ఓటీటీలోకి రాకుండానే రైలు ప్రయాణంలో ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో ఈ సినిమా చూస్తున్న దృశ్యాన్ని దర్శకుడు జితిన్ లాల్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది.

Show comments