NTV Telugu Site icon

Hrashwo Deergha: మొట్టమొదటి తెలుగు నేపాలీ సినిమాలో బ్రహ్మానందం.. ఆరోజే రిలీజ్

Hrashwo Deergha Release Date

Hrashwo Deergha Release Date

1st Telugu- Nepali Movie Hrashwo Deergha Release Date announced: మీమ్ గాడ్, హాస్యబ్రహ్మ అని అభిమానులు అందరూ పిలుచుకునే బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన తెలుగు నేపాలి మూవీ హ్రశ్వ దీర్ఘ అనే సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. బ్రహ్మానందం ఇప్పటికే అత్యధిక సినిమాలు చేసిన నటుడిగా గిన్నిస్ బుక్ లో వరల్డ్ రికార్డు సంపాదించారు. అయినా సరే కొంచెం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు అన్న మాటే కానీ అడపాదడపా ప్రేక్షకులను పలకరిస్తూ, అలరిస్తూనే ఉన్నారు. ఇక ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన తెలుగు – నేపాలి మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.

Sankranthi Movies OTT : సంక్రాంతి సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయ్.. ఈ డేట్లలోనే!

ఈ సినిమాకి హ్రశ్వ దీర్ఘ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి చంద్ర పంత్ దర్శకత్వం వహించగా కబీర్ లాల్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా వ్యవహరించారు. ఇక హరిహర్ అధికారి స్టోరీ అందించిన ఈ సినిమాకి నీతా దుంగనా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాని నీతా ఫిలింస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద నిర్మనిచ్చారు. ఈ సినిమాని సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ బ్రహ్మానందం నవ్వుతున్న ఫోటోతో పాటు షాక్ అయి చూస్తున్న మరొక స్టిల్ ను పోస్టర్ మీద ప్రచురించారు. ఇక ఈ సినిమాలో హరిహర్ అధికారి, నీతా దుంగనా, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, సునీల్ వర్మ కబీర్ దుల్హన్ సింగ్ వంటి వారు కీలక పాత్రలలో నటించారు. అన్నట్టు తెలుగు సినీ చరిత్రలో ఇదే మొట్టమొదటి తెలుగు నేపాలి మూవీ కావడం గమనార్హం.