Site icon NTV Telugu

Latest Release : ఏప్రిల్ 25న రిలీజ్ కు రెడీగా 15 సినిమాలు.. అరడజనుకు పైగా ఊరు, పేరు లేనివే

Tollywood

Tollywood

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు ఏవి రిలీజ్ కావడంలేదు. ఈ నెలలో రావాలసిన రెబల్ స్టార్ రాజాసాబ్, పవర్ స్టార్ హరిహర వీరమళ్లు రిలీజ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ రెండు డేట్స్ అలా వృధాగా వదిలేసారు. స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడడంతో చినన్ సినిమాలు వరుసబెట్టి థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ఎందుకు వస్తున్నాయో ఎవరికీ తెలియదు. గతవారం డజను సినిమాలు రిలీజ్ అయితే అందులో కాస్తో కూస్తో పేరున్నవి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి అలాగే తమన్నా నటించిన ఓదెల 2. మిగిలినవి ఇలా వచ్చి అలా వెళ్లాయి.

Also Read : RashaThadani : రవీనా టండన్ కూతురు ఫొటోస్ తో రచ్చలేపుతుందిగా

ఇక ఈ వారాం అనగా ఏప్రిల్ 25న డజనుకుపైగా సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి. వాటిలో నక్కిన త్రినాథ రావు నిర్మాతగా  ఇంద్ర రామ్ నటించిన చౌర్య పాఠం, కోర్ట్ తో సూపర్ హిట్ కొట్టిన ప్రియదర్శి లీడ్ రోల్ చేసిన సారంగపాణి జాతకం మినిమం బజ్ ఉన్న సినిమాలుగా చెప్పుకోవచ్చు. ఇక మలయాళ రీమేక్ సినిమా జింఖానా, ఎర్ర చీర, శివ శంభో, సర్వం సిద్ధం, మన ఇద్దరి ప్రేమ కథ, 6 జర్నీ, హలొ బేబీ, సూర్యపేట జంక్షన్ వంటి సినిమాలు ఉన్నాయి. అసలు ఈ సినిమాలు ఉన్నట్టు, రిలీజ్ అవుతున్నట్టు కూడా కనీసం సగటు ప్రేక్షకుడికి తెలియదు. ఇవే కాకుండా సూపర్ స్టార్ రజనీ కాంత్ బాషా, ఎన్టీఆర్ నటించిన అశోక్, మహేశ్ బాబు భరత్ అనే నేను రిరిలీరిజ్ కానున్నాయి.

Exit mobile version