Site icon NTV Telugu

“101 జిల్లాల అందగాడు” రాకకు ముహూర్తం ఖరారు

101 Jillala Andagadu Grand Release In Theaters on August 27th

కామెడీ ఎంటర్టైనర్ “101 జిల్లాల అందగాడు” రాకకు ముహూర్తం ఖరారైంది. అవసరాల శ్రీనివాస్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ‘చి.ల.సౌ’ ఫేమ్ రుహానీ శర్మ కథానాయికగా నటిస్తోంది. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అవసరాల శ్రీనివాస్ కథను అందించారు. దిల్ రాజు – క్రిష్ జాగర్లమూడి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై శిరీష్, వై.రాజీవ్ రెడ్డి , సాయిబాబు ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ చిత్రం మే 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

Read Also : ఆకు నుంచీ ఆకలి దాకా… ‘పుష్ప’ ఫస్ట్ సింగిల్ మాస్ ధమాకా!

కానీ ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ రోజు “101 జిల్లాల అందగాడు” చిత్ర నిర్మాతలు కొత్త పోస్టర్‌ను షేర్ చేస్తూ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ఆగస్టు 27న విడుదల కానుంది. 2017లో “బాబు బాగా బిజీ”, “అమీ తుమీ” తర్వాత “101 జిల్లాల అందగాడుతో శ్రీనివాస్ అవసరాల మళ్ళీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది.

Exit mobile version