Site icon NTV Telugu

దుమ్మురేపుతున్న “సర్కారు వారి పాట” టీజర్

10 Million Views for Sarkaru Vaari Paata Birthday Blaster

ఈ రోజు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా “సర్కారు వారి పాట” మేకర్స్ ఈ సినిమా టీజర్ ‘బ్లాస్టర్‌’ పేరుతో ఆవిష్కరించారు. “సర్కారు వారి పాట” టీజర్ లో మహేష్ బాబు స్టైలిష్ లుక్, హీరోయిన్ కీర్తి సురేష్‌తో ఆయన కెమిస్ట్రీ, కొన్ని హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లను అద్భుతంగా చూపించారు. 1 నిమిషం 14 సెకన్ల టీజర్ వీడియో మహేష్ బాబు కారు నుండి రావడంతో ప్రారంభమవుతుంది. ఓ డైలాగ్ తరువాత రౌడీలతో హీరో ఫైట్ ఉంది. ఈ టీజర్‌కి తగినట్టుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన స్టార్ సంగీత దర్శకుడు తమన్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” ఇప్పుడు యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

Read Also : ప్రభాస్ “సలార్”లో విలన్ అతనేనా ?

తాజాగా “సర్కారు వారి పాట” బ్లాస్టర్ 10 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్, 425K+ లైక్‌లను సాధించింది. అతి తక్కువ సమయంలోనే భారీ వ్యూస్ తో “సర్కారు వారి పాట” టీజర్ దుమ్మురేపుతోంది. ఇక “సర్కారు వారి పాట” దర్శకుడు పరశురామ్ కూడా మహేష్ బాబుకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా సెట్స్ లో ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు. “నా హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. డైరెక్టర్ గా మీతో పని చేయడం ఆనందంగా ఉంది సర్” అంటూ ట్వీట్ చేశాడు. మహేష్ బాబు, కీర్తి సురేష్ మొదటిసారి జంటగా నటిస్తున్న “సర్కారు వారి పాట” చిత్రం 13 జనవరి 2022 న విడుదల కానుంది.

https://www.youtube.com/watch?v=2cVu7KZxW3c
Exit mobile version