NTV Telugu Site icon

No Marriage: పెళ్లికి నో అంటున్న యువత.. కారణాలు ఇవేనా..

Untitled 8

Untitled 8

lifestyle: మనిషి జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే తాడు లేని బొంగరానికి విలువ లేదు. అలానే దారం లేని గాలిపటం ఎటుపోతుందో ఎవరికీ తెలీదు. మనిషి జీవితం కూడా అంతే. అందుకే మన పూర్వికులు పేళ్ళి అనే దారంతో బంధం వేశారు. ఈ బంధం ఒక భాధ్యతని స్వీకరించేలా చేస్తుంది. ఆ భాద్యత మనిషిని సన్మార్గంలో నడిపిస్తుంది. ఈ సృష్టి మనుగడకు కారణభూతంగా నిలుస్తుంది. అందుకే పెళ్ళికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. కానీ.. ప్రస్తుతం యువత మాత్రం పెళ్లికి దూరంగా పరుగులు తీస్తున్నారు. జంటగా మారం ఒంటరిగా ఉంటాం అంటున్నారు. ఇది ఏ ఒక్క ప్రాంతమో, లేక దేశం పరిస్థితికాదు. యావత్ ప్రపంచంలో యువత తీరు ఇలానే ఉంది. ఇలా పెళ్ళికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అని యువతను అడిగితే రకరకాల కారణాలు చెప్తున్నారు. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Read also:Health: ఆడవారికంటే మగవారికే ఎక్కువ.. ఏంటో తెలుసా..?

కొందరు యువత కెరీర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కనుక వైవాహిక జీవితానికి సమయం కేటాయించలేము అందుకే పెళ్లి చేసుకోవాలి అనే ఇంటరెస్ట్ లేదు అని చెప్తున్నారు. వివాహ బంధంలో ఇమడలేక విడాకులు తీసుకున్న జంటలను చూసి మరికొందరు పెళ్లి అంటేనే భయపడుతున్నారు. అందుకే ఒంటరిగా ఉంటున్నారు. అలానే పెళ్ళైతే స్వేచ్ఛ స్వాతంత్రం పోతుందని.. బాధ్యతులు తీసుకోవడం ఇష్టం లేదని.. జీవితంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందని.. మనశాంతి కరువవుతుందని ఇలా అనేక కారణాలు చూపి యువత పెళ్లి చేసుకోవడం లేదు. కానీ జీవితంలో కేరీర్ ఎంత ముఖ్యమో పెళ్లి, పిల్లలు అనే బాధ్యత కూడా అంతే ముఖ్యం. ఎవరో ఒకరి వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వచ్చాయని అందరి జీవితాలల్లో అలానే ఉంటాయి అనుకుంటే పొరపాటు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛ, స్వాతంత్రం అనుకుంటే ఈ సృష్టి ఇంతటితో ఆగిపోవాల్సిందే. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఉండే అనుబంధం నిస్వార్ధమైనది అయితే దంపతుల మధ్యన ఉండే అనురాగం కూడా నిస్వార్ధమైనదే. ఇది అర్ధమైతే జీవితం అర్ధవంతం అవుతుంది.

Show comments