ఒకప్పుడు రొమ్ము క్యాన్సర్ అంటే భయపడేవారు.. కానీ ఈరోజుల్లో ఈ క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది..అయితే రొమ్ము క్యాన్సర్ గురించి ఉన్న కొన్ని అపోహలు మహిళలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.. ఈ క్యాన్సర్ గురించి కాస్త వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..
*. సాదారణంగా ప్రతి మహిళ రొమ్ముల పరిమాణం భిన్నంగా ఉంటుంది. అలాగే రెండు రొమ్ముల ఆకారం కూడా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కొన్నింటిలో చాలా తేడా ఉంటుంది, కొన్నింటిలో చాలా తక్కువ తేడా ఉంటుంది. ఇది సర్వ సాధారణమైంది. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఇది సమస్యలకు సంకేతం కాదు.. భయపడకండి..
*.తల్లి పాలివ్వడం వల్ల రొమ్ములు సాగుతాయి ఇది గుర్తుంచుకోవాలి..వృద్ధాప్యం రొమ్ముల సడలింపునకు కారణమవుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మం దాని స్థితిస్థాపకతను కోల్పోతుంది. దీని వల్ల చర్మం వదులుగా మారుతుంది. అంతేకాకుండా బరువు పెరగడం వల్ల కూడా మీ రొమ్ములు వదులుగా మారుతాయి..
*. టైట్ బ్రాలు, డియోడరెంట్లు ఉపయోగించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది..టైట్ బ్రా ధరించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుంది అనే విషయంపై శాస్త్రీయ పరిశోధనలు లేవు. కాకపోతే ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అలాగే డియోడరెంట్, పాల ఉత్పత్తులు, మొబైల్ ఫోన్ల వాడకంపై ఎటువంటి పరిశోధనలు జరగలేదు. అయినప్పటికీ మీరు టైట్ బ్రాలను ధరించడం మానుకోవాలి. ఎందుకంటే ఇది మీకు సౌకర్యవంతంగా ఉండదు..
*. రొమ్ము క్యాన్సర్ వల్ల ఎప్పుడూ కూడా చనుమొనల నుంచి ఉత్సర్గ రాదు. థైరాయిడ్ సమస్యలు, పీసీఓఐఎస్, యాంటీ డిప్రెసెంట్స్ వంటి కొన్ని మందులు వంటి కొన్ని కారణాల వల్ల చనుమొనల నుంచి ఉత్సర్గ వస్తుంది. అందుకే బ్రెస్ట్ డిశ్చార్జ్ అయినప్పుడు కంగారు పడకండి. హాస్పటల్ వెళ్లి చెకప్ లు చేయించుకోండి…
*. యుక్త వయస్సులో ఉండేవారికి క్యాన్సర్ ప్రమాదం తక్కువగా ఉంటుంది..రొమ్ము క్యాన్సర్ 25 నుంచి 30 ఏండ్ల వారికి కూడా వస్తుంది. అలాగే గర్భధారణ సమయంలో కూడా మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరుగుతున్న మహిళలే కాదు అన్ని వయసుల మహిళలు రొమ్ము క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, దానిపై సరైన అవగాహన ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అందం కోసం ప్రయోగాలు చెయ్యకపోవడమే మంచిదని గుర్తుంచుకోండి..
