NTV Telugu Site icon

Women : పీరియడ్స్ సమయంలో మహిళలు వీటి జోలికి అస్సలు వెళ్లకండి..!

Periods

Periods

మహిళలకు ప్రతి నెల పీరియడ్స్ రావడం కామన్.. ఆ సమయంలో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది.. నీరసంగా, బాడి పెయిన్స్, అలా వాంతులు అవ్వడం ఇలాంటి సమస్యలు వస్తుంటాయి.. అయితే ఆహారంలో మార్పులు తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. కొన్ని ఆహారాలను అసలు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు అవేంటో ఒకసారి చూద్దాం..

కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు. కొవ్వు ఉండే పదార్థాలు తింటే పొత్తి కడుపులో నొప్పి, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. స్త్రీ జననేంద్రియాలలో కూడా సమస్యలు వస్తాయి. చక్కర ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తినకూడదు. వాటిని తినడం వలన మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగడం, తగ్గడం జరుగుతుంది. దీనివల్ల మనకు స్వీట్ గా ఉండే పదార్థాలను తినాలని అనిపిస్తుంది. ఇలా చేయడం వలన మనకు డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది.. అందుకే తీపి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది..

పీరియడ్స్ సమయంలో కొంతమంది నొప్పుల కోసం లేదా కావాలనే ఆల్కహాల్ ను సేవిస్తారు.. ఇది చాలా తప్పు.. ఎందుకంటే కొన్ని రకాల హార్మోనలను విడుదల చేస్తాయి.. అది చాలా ప్రమాదం.. అసలు మందు తాగకూడదు.. ఇక పాలు తాగకూడదు ఎందుకంటే పాలల్లో ఉండే లాక్టోజ్, అరాకిడోనిక్ అనే ఆమ్లం ఉంటుంది. అది మన పొట్ట ఉబ్బరాన్ని పెంచి పొట్టలో నొప్పి వచ్చేలా చేస్తుంది.. చూసారుగా అందుకే పెద్దలు పాలు, పెరుగు తినొద్దని చెబుతారు.. మొదటి మూడు రోజులు వీటికి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.