Site icon NTV Telugu

Women Health: డెలివరీ తరువాత స్త్రీలు డిప్రెషన్‌కు ఎందుకు గురవుతారో తెలుసా?

Depression Depressed Woman Sleep Awake Night Insomnia Tired Shut

Depression Depressed Woman Sleep Awake Night Insomnia Tired Shut

మహిళలకు అమ్మతనం గొప్ప వరం.. కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి డెలివరీ అయ్యేవరకు ఒకలా ఉంటుంది.. డెలివరీ అయ్యాక వారిలో మార్పులు కూడా చాలానే వస్తున్నాయి.. అయితే చాలా మంది మహిళలు డిప్రెషన్ కు ఒత్తిడికి గురవుతారు.. ఆందోళన, ఉద్రిక్తతకు గురవుతారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం ఏమిటి? నిజానికి కొంతమంది మహిళలు ప్రసవానంతర డిప్రెషన్‌కు గురవుతారు. శరీరంలో మార్పులు, కొత్త బాధ్యతల ఒత్తిడి వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది… మహిళల్లో డిప్రెషన్ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రసవానంతరం చాలా మంది మహిళల్లో ఆందోళనలు కలుగుతాయి. అన్ని వేళలా విచారంగా ఉంటారు. అలిసిపోయినట్లుగా ఉంటారు. నిద్ర పట్టదు, ఆకలి అనిపించదు. ఎందులోనూ సంతోషం దొరకదు. విషయాలపై దృష్టి పెట్టలేరు. పిల్లల సంరక్షణలో ఆసక్తి చూపరు. ఈ సమయంలో ఆత్మహత్య ఆలోచనలు కూడా మనస్సులో మెదులుతాయి. ఇవన్నీ ప్రసవానంతర డిప్రెషన్‌కు సంకేతాలుగా నిపుణులు చెబుతున్నారు..

డిప్రెషన్ కు గురవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. గర్భధారణ సమయంలో ఏదైనా పెద్ద సంఘటన జరిగితే. ఉదాహరణకు, ఎవరైనా చనిపోవచ్చు, ఉద్యోగం కోల్పోవచ్చు. ఇది కాకుండా, భావోద్వేగ, శారీరక, ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే.. ప్రసవానంతర డిప్రెషన్ ఉండవచ్చు. చాలా సార్లు డెలివరీ తర్వాత సపోర్ట్ లేకపోవడం, ప్రసవానంతర డిప్రెషన్ కూడా రావచ్చు..

డిప్రెషన్ ను ఎలా తగ్గించుకోవాలంటే?

స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి.. రిలాక్స్ అవ్వాలి. డాక్టర్‌తో మాట్లాడి చికిత్స తీసుకోవాలి. ఇలా చేస్తే సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు. ఎంత త్వరగా అలర్ట్ అయితే మీకు, మీ పిల్లలకు అంత మంచిది. అలాగే మీ సంబంధాలపైనా మంచి ప్రభావం ఉంటుంది. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది..

Exit mobile version