Site icon NTV Telugu

Winter Health Tips: రోజు రోజుకూ పెరుగుతున్న చలి.. జర భద్రం గురూ..

Winter Health Care Tips For Children

Winter Health Care Tips For Children

Winter Health Tips: చలికాలం మొదలైంది. పగటి వేళ తగ్గిపోవడంతో పాటు ఉష్ణోగ్రతలు ఒక్కో రోజు మరొక స్థాయికి దిగజారుతాయి. ఈ మార్పులు కేవలం వాతావరణానికే పరిమితం కావు.. మన ఆరోగ్యంపై, రోజువారీ పనితీరుపై కూడా వాటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. చలి ఇచ్చే ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ జబ్బుల నుంచి దూరంగా ఉండాలంటే ఈ సీజన్‌లో పలు చిట్కాలు, ఆరోగ్య సూత్రాలు పాటించడం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: OnePlus 15R Launch: 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. స్పెషల్ స్పెసిఫికేషన్లతో వస్తున్న వన్‌ప్లస్‌ 15ఆర్!

చలికాలంలో మన శరీరం వేడి కోల్పోతుంది. ఆ వేడిని నిలుపుకునేందుకు శరీరం అదనపు శ్రమ చేస్తుంది. ఈ ప్రక్రియలో రోగనిరోధక శక్తి కొంత బలహీనమవుతుంది. అందుకే ఈ కాలంలో జలుబు, దగ్గు, ఫ్లూ, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. పెద్దవారి శ్వాసకోశాలు, చిన్నారుల శరీరం, గర్భిణుల శారీరక స్థితి ఈ మార్పులకు త్వరగా ప్రభావితమవుతాయి. అందుకే వృద్ధులు, చిన్నారులు బయటకు వచ్చేటప్పుడు తలకు, ముఖానికి, చెవులకు రక్షణ ఇచ్చే దుస్తులు తప్పనిసరిగా ఉపయోగించాలి.

READ MORE: Prasanth Varma: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం? – IFFI స్టేట్‌మెంట్‌పై పెద్ద చర్చ

ఇక పరిసరాల గురించి చెప్పాలి అంటే, చలికాలంలో గాలి పొడిగా మారుతుంది, తేమ తగ్గిపోతుంది. ఈ పొడిబారిన గాలి మన చర్మాన్ని కఠినంగా, పొరలుగా మారుస్తుంది. దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావచ్చు. నీరు తగినంతగా తాగకపోతే శరీరం సులభంగా అలసట చెందుతుంది. చలి ఉన్నప్పుడు నీరు తాగాలనే తపన తగ్గిపోతుంది కానీ ఈ సీజన్‌లో నీరు, హర్బల్ టీలు, వెచ్చని ద్రవ పదార్థాలు శరీరానికి కావాల్సిన వేడి, తేమ, శక్తి అందిస్తాయి. అయితే చలిలో శరీరానికి వేడి అందే ప్రధాన మార్గం వ్యాయామం మాత్రమే. పెద్ద ఎత్తున వ్యాయామం అవసరం లేదు. ఇంట్లోనే తేలికపాటి యోగా, చిన్న చిన్న వ్యాయామాలు శరీరాన్ని చురుకుగా, రక్తప్రసరణను సమతుల్యం చేస్తాయి.

READ MORE: Prasanth Varma: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం? – IFFI స్టేట్‌మెంట్‌పై పెద్ద చర్చ

చలికాలం ఆరోగ్యానికి శత్రువయ్యే ఇంకో అంశం పరిశుభ్రత. నీరు కలుషితం అయితే డయేరియా వంటి సమస్యలు వేగంగా వ్యాపిస్తాయి. గాలి కాలుష్యం పెరిగితే స్వైన్ ఫ్లూ నుంచి శ్వాసకోశ సమస్యల వరకూ అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే చలికాలంలో శరీర శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత కూడా చాలా ముఖ్యం. చెత్త పేరుకుపోయిన ప్రాంతాలు దోమలకు ఆశ్రయం కల్పించి డెంగీ, చికన్ గున్యా వంటి రోగాలను వ్యాప్తి పరిచే ప్రమాదం ఉంది.

Exit mobile version