Winter Health Tips for Children: చలికాలం మొదలైంది. రాత్రి, ఉదయం వేళల్లో చల్లగాలులు వీస్తున్నాయి. చిన్న పిల్లలకు కష్టంగా మారుతుంది. పెద్దలు కొంతవరకు చలిని తట్టుకోగలిగినా, పిల్లల శరీరం చాలా సున్నితంగా ఉండటంతో తక్షణమే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. సాధారణ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఈ కాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఐదేళ్ల లోపు పిల్లలకు చలి ప్రభావం మరింతగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం.
READ MORE: Thalaivar173 : మామ సినిమాకు అల్లుడు డైరక్షన్.. కూతురు ఒప్పుకుంటుందా.?
చలికాలంలో ప్రధాన సమస్య వైరస్లు, బ్యాక్టీరియా ఎక్కువగా వ్యాపించడం. పిల్లలు పాఠశాల, ప్లే ఏరియా నుంచి ఇంటికి వచ్చేటప్పుడు పలు వైరస్, బ్యాక్టీరియాను వెంట తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా పిల్లలకు సమయానికి టీకాలు వేయాలి. ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ వంటి సీజనల్ టీకాల వల్ల జలుబు, దగ్గు తీవ్రత తగ్గుతుంది. పుట్టిన ఏడాదిలో రెండుసార్లు, ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఒకసారి ఈ టీకాలు తప్పనిసరిగా వేయించాలి. అలాగే చిన్నారులు ఉండే గదులను శుభ్రంగా, గాలి చొరబడేలా ఉంచడం కూడా చాలా ముఖ్యం. పిల్లలకు అందించే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. చలివల్ల పిల్లలు తక్కువ నీరు తాగుతారు. దీంతో డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారితో ఎక్కువ నీరు తాగించే అలవాటు పెంచాలి. గోరువెచ్చని నీరు ఇవ్వడం మంచిది. అలాగే విటమిన్ సీ, ఐరన్, జింక్ వంటి మినరల్స్ అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు, నాటు కోడి గుడ్లు, గోధుమ పదార్థాలు వంటి ఆహారం ఇవ్వాలి. వీటితో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చల్లని ఆహారాలు ఇవ్వడం మానుకోవాలి. ఇంకా బ్రెస్ట్ ఫీడ్ లేదా ఫార్ములా మిల్క్ ఇవ్వడం కొనసాగించాలి.
READ MORE: Neck Guards: ఏం ఐడియా గురూ.. .. పులులు బారి నుంచి రక్షించుకోవడం కోసం..
చర్మ సంరక్షణ కూడా చలికాలంలో చాలా ముఖ్యం. చిన్నారుల చర్మం పెద్దల చర్మంతో పోలిస్తే మరింత సున్నితంగా ఉంటుంది. చలివల్ల అది త్వరగా డ్రై అవుతుంది. రోజూ మాయిశ్చరైజర్ రాస్తే చర్మం పొడిబారకుండా, చిగుళ్లు, పగుళ్లు రాకుండా ఉంటుంది. బయటకు వెళ్లే సమయంలో సన్‌స్క్రీన్, లిప్‌బామ్ వాడటం మంచిది. పిల్లల ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకం.. పిల్లల గదిలో ఉష్ణోగ్రత సమతుల్యంలో ఉండేలా చూసుకోవాలి. చలి ఎక్కువగా ఉందని బాగా వేడి చేసిన నీళ్లు, ఆహార పదార్థాలు ఇవ్వడం ప్రమాదకరం. బాడీ టెంపరేచర్‌కు సరిపోయే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. దుస్తుల విషయంలో పెద్దగా మందమైన స్వెట్టర్ల కంటే తేలికపాటి దుస్తులను లేయర్లుగా వేయడం మంచిది. ఇది పిల్లలకు కంఫర్ట్‌గా ఉండటమే కాకుండా, శరీర ఉష్ణోగ్రత సరిగ్గా ఉంచేందుకు సహాయపడుతుంది. తలకు టోపీ, చేతులకు గ్లౌజులు, పాదాలకు సాక్స్ వంటి రక్షణ దుస్తులు తప్పనిసరిగా వేయాలి. రాత్రి వేళ గదిలో చల్లగాలి రానివ్వకూడదు.
READ MORE: Telangana Cotton Millers Strike: రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్..
చలికాలంలో పిల్లలకు దగ్గు ఎక్కువగా వస్తుంది. ఇది పొడి దగ్గు కావచ్చు, శ్లేష్మంతో కూడిన దగ్గు కావచ్చు. రెండు పరిస్థితులు కూడా చిన్నారులకు ఇబ్బందికరమే. జలుబు, ఫ్లూ, రైనోవైరస్ వంటి వివిధ వైరస్‌లు దగ్గుకు ప్రధాన కారణాలు. ఐదేళ్ల లోపు పిల్లలు వీటి ప్రభావానికి ఎక్కువగా గురవుతారు. కొందరు తల్లిదండ్రులు ఇంట్లోనే దగ్గు సిరప్ ఇస్తుంటారు. చిన్న దగ్గు అయితే తగ్గిపోవచ్చు కానీ, దగ్గు 2–3 వారాలకు మించినా, లేదా ఎక్కువగా వస్తున్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి. వైద్య నియమాలు పాటించకుండా మందులు ఇవ్వడం ప్రమాదకరం. చిన్నారులతో బయటకు వెళ్లేప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. చలి ఎక్కువగా ఉంటే వారిని బయటకు తీసుకెళ్లకపోవడమే మంచిది. అత్యవసర పరిస్థితుల్లో తీసుకెళ్తే పూర్తిగా కవర్ చేసి, అవసరమైన మందులు, నీళ్లు, డైపర్లు, అదనపు దుస్తులు వెంట తీసుకువెళ్ళాలి. తలను కప్పడం మాత్రం మరచిపోవద్దు.
