NTV Telugu Site icon

Health Tips: భోజనం చేసిన తర్వాత నడకతో లాభం..! నిజమెంత..?

Walking

Walking

Health Tips: నడక ఆరోగ్యానికి మంచిదే.. కానీ, ఏ సమయంలో చేయాలి.. ఉదయం మంచిదా? మధ్యాహ్నం బెటరా? సాయంత్రం మంచిదా..? అనే అనుమానాలు చాలా మందిలో ఉంటాయి.. ఎంతైనా ఉదయం పూట నడక ఎంతో శ్రేయస్కరం అంటారు.. అయితే, భోజనం చేసిన తర్వాత వాకింగ్‌ చేయాలా? అది మంచిదేనా? అనే విషయంలోనూ కొందరు అనుమాలున్నాయి.. భోజనం చేసిన తర్వాత నడవాలని చాలా సార్లు విని ఉంటారు.. దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణమై నిద్ర కూడా బాగుంటుందని కూడా ఎక్కడైనా చదవడమో.. ఎక్కడో వినే ఉంటారు.. అసలు దీనిలో నిజమెంతా? అనే విషయాలను ఓసారీ పరిశీలిద్దాం..

క్రమ పద్ధతిలేని జీవనశైలి వల్ల అనేక నష్టాలు ఉంటాయి.. కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఆహారం తీసుకున్న తర్వాత పడుకోవడం లేదా ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం తరచుగా చాలా మంది చేసే పని.. అయితే, ఆహారం తిన్న వెంటనే ఒకే చోట పడుకోవడం లేదా కూర్చోవడం వల్ల చాలా తీవ్రమైన రోగాలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ముఖ్యంగా రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమిస్తే బరువు పెరగడమే కాకుండా శరీరాన్ని అనేక వ్యాధులు సోకుతాయి. మన శరీరం రోగాల కుప్పగా మారుతుందని వార్నింగ్‌ ఇస్తున్నారు.. ఆహారం తీసుకున్న తర్వాత కొంతసేపు నడవాలని.. దీనివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని.. ఆహారం సులువుగా జీర్ణం అవుతుందని చెబుతున్నారు.

అంటే, భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం చాలా మంచిది అంటున్నారు.. ఆహారం తీసుకున్న తర్వాత వాకింగ్‌ చేయడం వలన శరీరం చురుకుగా మారుతుంది. దీని కారణంగా శరీరం పోషకాలను గ్రహిస్తుంది. మన ఆహారం జీర్ణక్రియలో ముఖ్యమైన భాగం చిన్న ప్రేగులలో జరుగుతుంది. భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల కడుపు నుంచి చిన్న ప్రేగులకు ఆహారం వేగంగా చేరుతుందని వైద్య నిపుణులు చెబుతున్నమాట.. ఇక, కడుపులోని ఆహారం పేగుల్లోకి వెళ్లగానే కడుపు ఉబ్బరం, గ్యాస్, యాసిడ్ వంటి సాధారణ సమస్యలేవీ రావని.. పరిశోధన ప్రకారం, భోజనం తర్వాత 30 నిమిషాలు నడవడం.. వ్యాయామం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని.. ఇది మలబద్ధకం అవకాశాలను తగ్గిస్తుందని సూచిస్తున్నారు.. భోజనం చేసిన తర్వాత కనీసం 20 నిమిషాల పాటు నడవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నమాట.. సమయం ఎక్కువగా ఉంటే మాత్రం.. 20 నుండి 40 నిమిషాల వరకు నడిస్తే మరీ మంచిదని చెబుతున్నారు.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments