Site icon NTV Telugu

Girls & Depression: అమ్మాయిలు ఎక్కువగా డిప్రెషన్‌లోకి ఎందుకు వెళ్లిపోతారు..?

Girls Dipretion

Girls Dipretion

అందంగా కనిపించే ప్రతి అమ్మాయి లోపల కూడా ఏదో ఒక పోరాటం నడుస్తుంటుంది. నవ్వుతున్న చిగురుతో ఆమె బాహ్యంగా సంతోషంగా కనిపించినా లోపల మాత్రం ఆందోళన, ఒత్తిడి, భయం, అనిశ్చితితో కూరుకుపోతూ ఉంటుంది. ఈ తరహా భావోద్వేగాల పునాది శరీరంలో జరుగుతున్న హార్మోన్ల మార్పులే. అర్థం చేసుకోవాలంటే శాస్త్రాన్ని వినాలి – ఎందుకంటే ఇది ‘అభిమానంగా చూసే’ విషయం కాదు‘ అవగాహనతో అర్థం చేసుకునే’ విషయం!

Also Read : Vijay Deverakonda : బాక్సాఫీస్ హిట్ కొట్టిన .. విజయ్ కి తప్పని తిప్పలు

ఎందుకు అమ్మాయిలు చిన్న విషయానికే ఎక్కువగా బాధపడతారు? ఎందుకు వారు రోజులు తరబడి మూడ్‌లో ఉండకపోతారు? నిజంగా వాళ్లలో బలహీనత ఉందా? లేక ఇది శరీర, మానసిక మార్పుల కలయిక మాత్రమేనా? నిపుణులు స్పష్టంగా చెబుతోంది ఏంటంటే.. ఇది నాటకీయత కాదు, ఇది బయోలాజికల్ రియాలిటీ. అమ్మాయిలు ఎదుర్కొనే డిప్రెషన్ సమస్య వెనకున్న నిజాలు తెలుసుకోండి. ఎందుకంత డిప్రెషన్.. దానికి ఎందుకంత బాధ? అని చాలా మంది అమ్మాయిలను  అలాగే వదిలేస్తారు. కానీ లోతుగా చూసినప్పుడు అర్థమవుతుంది – ఇది నాటకం కాదు, నిజంగా ఆమె శరీరం, మనసు ఓ నిస్సహాయ స్థితిలో ఉన్నాయ్. హార్మోన్ల అసమతుల్యత, జీవిత ఒత్తిడులు కలగలిపి అమ్మాయిల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

సెల్ఫ్ కేర్ ఎంతో ముఖ్యం:
ఈ సమయంలో అమ్మాయిలు తీసుకోవాల్సిన ముఖ్యమైన స్టెప్పులు.. ప్రతిరోజూ వ్యాయామం / యోగా, పౌష్టికమైన ఆహారం తీసుకోవడం, సరిగ్గా నిద్రపోవడం (7-8 గంటలు), ఆత్మబలం కోసం ధ్యానం / చిట్కాలు, నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను కలవడం లాంటివి చేయడం ఉత్తమం.సామాన్యంగా అనిపించిన డిప్రెషన్, దీర్ఘకాలంగా కొనసాగితే మానసిక వ్యాధులకూ దారి తీసే అవకాశం ఉంది. అందుకే అమ్మాయిల్లో ఎలాంటి మార్పులు కనిపించిన అర్థం చేసుకొని, తోడుండాలి. “మంచిగా ఉండాలి” అని చెప్పడం కంటే “ఎమైంది?” అని ఓ స్నేహితుడిలా అడగడం అవసరం. వారు పుట్టిన కానుంచి అమ్మయిలకు ప్రతిది సవాల్ లాగానే ఉంటుంది. సమాజం, కుటుభం ప్రతి చోట ఏదో విషయంలో ఓత్తిడికి లోనవుతూనే ఉంటారు. కనక ఆడవాళ్ళ బాధపడుతున్నట్లుగా ఉంటే ఓదార్పు ఇవ్వండి.

 

 

Exit mobile version