Site icon NTV Telugu

Dandruff Causes: చుండ్రు ఎందుకు వస్తుంది..? ఎలా తగ్గించుకోవాలంటే..

Dandruff Causes

Dandruff Causes

Dandruff Causes: ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చుండ్రు సమస్యను సర్వసాధారణంగా ఎదుర్కొంటారు. వాస్తవానికి ఈ సమస్య జుట్టు అందాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, తలపై దురద, చికాకును కలిగిస్తుంది. సాధారణంగా చాలా మంది దీనిని చిన్న సమస్యగా భావించి, విస్మరిస్తారు. కానీ ఈ సమస్యను సకాలంలో పరిష్కరించుకోకపోతే చాలా తీవ్రమవుతుందని, జుట్టు రాలడం, తలపై ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. చుండ్రు నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని హోమ్ టిప్‌ను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికల సందడి.. తొలి రోజు భారీగా నామినేషన్లు..

అసలు చుండ్రు సమస్య రావడానికి కారణం తలలో విటమిన్ బి3, విటమిన్ బి2, విటమిన్ బి6, జింక్ లోపం అని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు.

వీటిని ట్రై చేయండి..

కొబ్బరి నూనె & నిమ్మకాయ: కొబ్బరి నూనెలోని పదార్థాలు తలకు పోషణను అందిస్తాయి. అయితే నిమ్మకాయలోని సహజ ఆమ్లం చుండ్రు కలిగించే ఫంగస్‌ను తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెను ఒక టీస్పూన్ నిమ్మరసంతో కలిపి, కొద్దిగా వేడి చేసి, తలకు మసాజ్ చేయాలని, 30 నిమిషాలు తర్వాత తేలికపాటి షాంపూతో కడిగితే సరిపోతుందని చెప్పారు.

పెరుగు : పెరుగులో లభించే ప్రోబయోటిక్స్ తలపై చర్మం చికాకు, తెల్లటి పొరలను తగ్గించడంలో సహాయపడతాయి. అర కప్పు పెరుగును తలపై అప్లై చేసి, 20 నుంచి 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీరు, తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవడం వల్ల చుండ్రు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని వెల్లడించారు.

మెంతి గింజలు: మెంతి గింజలు ఒక యాంటీ ఫంగల్ ఏజెంట్, ఇవి చుండ్రును తొలగించడంలో సహాయపడతాయి. మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం వాటిని పేస్ట్ లా రుబ్బి, 30 నుంచి 40 నిమిషాలు తలకు అప్లై చేయడం వల్ల చండ్రు సమస్యను పరిష్కరించుకోవచ్చు.

READ ALSO: India – Nepal: భారత్ – నేపాల్ మధ్య రూ.100 నోటు పంచాయితీ..

Exit mobile version