ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని అంటారు. అంటే దీని బట్ట అర్థం చేసుకోవచ్చు ఉల్లి ఆరోగ్యానికి ఎంత మంచిదో. ప్రతి వంటకాల్లో ఉల్లిపాయ తప్పనిసరి. ఉల్లిపాయ లేని వంటింటిని ఊహించలేం. కూర వండాలన్నా, పోపు వేయాలన్నా ఉల్లిగడ్డ ఉండాల్సిందే. ఈ ఉల్లి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి తెల్ల ఉల్లిపాయ, ఇంకొక్కటి ఎర్ర ఉల్లిపాయ. ఈ రెండింటిలోనూ ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉన్నాయి, కానీ కొంత వరకు వాటి గుణాలు, ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి. ఏ ఉలిపాయలు మంచివో అన్నది మీ ఆరోగ్య లక్ష్యాలు, అవసరాలపై ఆధారపడి ఉంటుంది. కనుక ఈ రెండింటిలో ఏది మంచిది.. ఎవరు ఏ ఉల్లి తినాలి.. ఏ ఉల్లి తినకూడదు ఇప్పుడు చూదాం.
Also Read: Prithviraj Sukumaran: ప్రభాస్ గురించి అసలు నిజం బయటపెట్టిన పృథ్వీరాజ్ సుకుమారన్
* పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయల్లో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది.
* ఎర్రని ఉల్లిపాయ శరీరంలో వ్యర్థ పదార్థాలను బయట పోవడానికి సహాయపడతాయి. ఎర్ర ఉల్లిపాయల్లో అధికమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. క్వెర్సిటిన్ అనే యాంటీఆక్సిడెంట్ కారణంగా ఇది హృదయ ఆరోగ్యం, క్యాన్సర్ నిరోధక లక్షణాలు, శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయ పడతాయి.
*అలాగే స్కిన్ ఆరోగ్యం కోసం, చర్మం పగుళ్లు, ముడతలు ఏర్పాటును నివారించడానికి సహాయపడతాయి. జీవక్రియ ను మెరుగుపరిచేందుకు, రక్తపోటు తగ్గించడానికి ఎర్ర ఉల్లిపాయలు చాలా మంచివి. గుండె ఆరోగ్యం,వ్యాధి నిరోధక శక్తి పెంపు కోసం ఎర్ర ఉల్లిపాయలు తినండి.
* ఇక జీర్ణక్రియ, మోతాదులో తక్కువ శక్తి అవసరం ఉన్నప్పుడు తెల్ల ఉలిపాయలు తింటే మంచిది. ఎర్ర ఉల్లిపాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది రుచిగా ఉంటుంది. ఎర్ర ఉల్లిపాయ కంటే తెల్ల ఉల్లిపాయల్లో ఎక్కువ నీరు, చక్కెర శాతం అధికంగా ఉంటుంది. ఎర్ర ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఎర్ర ఉల్లిపాయ రక్తాన్ని శుద్ధి చేసి కొలెస్ట్రాల్లో నియంత్రించడంలో సహాయపడుతుంది. తెల్ల ఉల్లిపాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, ఎసిడిటీ వంటి కడుపు సమస్యల నుండి బయట పడేస్తాడు.
* అంతే కాదు చిన్న ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ కూడా ఉంటాయి. ఇందులో పెద్ద ఉల్లిపాయ కంటే చిన్న ఉల్లిపాయలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని పచ్చిగా తింటే మరీ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా చలికాలంలో ఉల్లిపాయలను తినడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
* ముఖ్యం అయిన విషయం ఏంటి అంటే.. మనం సాధారణంగా ఎన్నో కూరగాయలు తీసుకొస్తాం. వాటన్నింటినీ ఎక్కువగా ఫ్రిజ్‌లో పెడతారు. కానీ, ఉల్లిపాయలు మాత్రం బయట ఉంచుతారు. దీనికి కారణం అది తేమగా మారతాయి. కనుక ఎట్టి పరిస్థితిలోను ఉల్లిగడ్డ ఫ్రిజ్ లో ఉండకూడదు. తెల్ల ఉల్లిపాయలతో పాటు, పసుపు ఉల్లిపాయలు, ఎర్ర ఉల్లిపాయలు కూడా ఉంటాయి.
*పసుపు ఉల్లిపాయలు, అల్లియం కుటుంబానికి చెందిన ఉల్లిపాయల రకం. వీటి చర్మం పసుపు రంగులో ఉంటుంది, కానీ లోపల తెల్లగా ఉంటుంది. పసుపు ఉల్లిపాయలు బలమైన రుచిని కలిగి ఉంటాయి. హెల్త్‌లైన్ ప్రకారం, ఉల్లిపాయలు ఎముకల సాంద్రతను మెరుగుపరచడానికి, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.