Romance: ఒక మనిషికి తిండి, నిద్ర ఎంత అవసరమో.. శృంగారం కూడా అంతే అవసరం. ఇది ఇండియాలో చాలామందికి తెలియదు. అసలు శృంగారం మాట ఎత్తగానే అదేదో బూతు అన్నట్లు చెప్పుకొచ్చేస్తారు. అందుకే బయట శృంగారం గురించి మాట్లాడంటే అందరు సంకోచిస్తారు. ఆరోగ్యకరమైన శృంగారం వలన మనిషి ఎక్కువ రోజులు బ్రతుకుతాడని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి. మానసిక ఒత్తిడి, చిరాకులు.. శృంగారం వలన తగ్గుతాయట. ఇక యువతీయువకుల శృంగారం గురించి మాట్లాడితే.. ఎక్కువగా అబ్బాయిలు ఇలాంటి కామకోరికలు ఉన్నట్లు బయటపడతారు. కానీ, వారికన్నా ఎక్కువగా అమ్మయిలకే ఆ కోరికలు ఎక్కువ ఉంటాయట. అంతేకాకుండా శృంగారాన్ని ఏ వయస్సులో చేస్తే.. వారు ఎంత ఎంజాయ్ చేస్తారో అన్నదానిపై రీసెర్చ్ కూడా జరిగిందట. అందులో మగవారికి అయితే ఒక వయస్సు వచ్చాకా ఆ కోరికలు తగ్గిపోతాయి కానీ, ఆడవారికి మాత్రం 60 ఏళ్ళ వయస్సులో కూడా కామ కోరికలు ఉంటాయట. అయితే మగువలను ముగ్గులోకి దింపాల్సిన బాధ్యత మాత్రం మగవారిదే అన్నమాట.
ఇక సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక ఏజ్ అంటే టీనేజ్ లో బాగా కోరికలు ఉంటాయి. ఆ సమయంలో ఆడవారు రెండు విధాలుగా ఆలోచిస్తారట. కొంతమంది ఆ కోరికలను దాచుకొని పెళ్లి తరువాత బయటపెట్టాలని అనుకుంటారట. ఇంకొంతమంది పెళ్ళికి ముందే ఆ అనుభవం తెలుసుకోవాలని కోరుకుంటారట. ఇక మగవారితో పోలిస్తే ఆడవారు ఇలాంటి విషయాల్లో చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారట. ఇక మహిళల్లో 30 నుంచి 40 వయస్సులో ఎక్కువ కోరికలు ఉంటాయట. ఆ సమయంలో భాగస్వామి ఎక్కువ సంతోషపెడితే బావుంటుందని కోరుకుంటారని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అయితే ఇక్కడ మగవారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఎన్నేళ్లు అయినా.. ఆడవారు.. తమకు ఇంట్రెస్ట్ ఉంటేనే.. తమకిష్టమైన మనిషితోనే శృంగారంలో పాల్గొంటారట. తమ భాగస్వామి కనుక శృంగారంపై ఇంట్రెస్ట్ చూపించకపోతే మాత్రం.. వారి కోరికలను మనసులోనే అణిచివేస్తారని పరిశోధనలో తేలింది.