Site icon NTV Telugu

Summer Food: సమ్మర్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి?

Summer Food

Summer Food

వేసవి కాలం వచ్చిందంటే చాలు మనం కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలు బాగా తినేస్తాం. ఎండాకాలం వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఐస్‌క్రీములు, శీతలపానీయాలను ఆశ్రయించడం ఎంతమాత్రం మంచిదికాదంటున్నారు డాక్టర్లు. అందులో కెలోరీలు అధికం. కాబట్టి, వాటిని దూరంగా ఉంచి.. మనకు తగినన్ని పోషకాలను అందిస్తూనే శరీరాన్ని చల్లగా ఉంచే పండ్లు, కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం. సమ్మర్‌లో ఎక్కువ వాటర్ తాగాలి. రోజుకి 4 లీటర్ల మంచి నీరు తాగాలి. నాన్ వెజ్ జోలికి వెళ్ళకూడదు. సమ్మర్‌లో స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తీసుకోకూడదు. జంక్ ఫుడ్ తినకూడదు. దీనివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి తేలికగా జీర్ణం అయ్యే ఆహారం, నీటి శాతం ఎక్కువ ఉండే పండ్లు తీసుకోవాలి.

Exit mobile version