NTV Telugu Site icon

Rudraksha: రుద్రాక్ష అంటే ఏమిటి? ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

Untitled 3

Untitled 3

Health: శివుడు ధ్యానంలో నుండి బయటకి వచ్చినపుడు ఆ పరమేశ్వరుని కన్నుల నుండి కన్నీరు జారీ భూమి పైన పడగా ఆ కన్నీటి బిందువులు రుద్రాక్ష గింజలుగా మారి చెట్లుగా పెరిగాయని.. వాటినే ప్రస్తుతం మనం రుధ్రాక్షలుగా పిలుస్తున్నాం అని శివపురాణం చెబుతుంది. రుద్రాక్ష ఈ పదాన్ని విడదీస్తే రుద్ర+అక్ష అని వస్తుంది. రుద్రుడు అనగా శివుడు. అలానే అక్ష అనగా కన్ను. అంటే శివుని కన్ను నుడి జాలువారిన కన్నీటి బిందువు కనుక దీనిని రుద్రాక్ష అంటారు.

Read also:Hyderabad: హైదరాబాద్ తో మహాత్ముని అనుబంధాలు…!

ఈ రుద్రాక్షలను హిందువులు పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. ఇప్పటికి చాలామంది ఈ దృద్రాక్ష మాలను ధరించడం మనం చూస్తుంటాము. అయితే ఈ రుద్రాక్షను ధరించడం వెనుక ఆధ్యాత్మికతతో పాటు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రుద్రాక్షల్లో విద్యుత్ అయస్కాంత తత్వం ఉంటుంది. ఈ శక్తి రుద్రాక్షల్లో వైబ్రేషన్లు కలిగిస్తుంది. దీన్ని హెన్రీ (వోల్ట్ సెకండ్స్/ యాంపియర్) అనే యూనిట్లలో కొలుస్తారు. రుద్రాక్ష నుండి వెలువడే ఈ తరంగాలు మెదడులో కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడిని తగ్గించి మనశాంతిని అందిస్తాయి. అంతే కాదు రుద్రాక్షకి డయామాగ్నెటిజం అనగా బయట ఉన్న విద్యుత్ క్షేత్రానికి వ్యతిరేక ఛార్జ్ తాత్కాలికంగా పొందే గుణం ఉంటుంది. ఇది రక్తప్రసరణ, గుండె పనితీరు పైన ప్రభావం చూపి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే మన పూర్వికులు రుద్రాక్షను ధరిస్తే ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని గ్రంధాలలో పేర్కొన్నారు.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments