Site icon NTV Telugu

Weight Loss Tips : రోజూ కీరాను ఇలా తీసుకుంటే చాలు.. కొవ్వు వెన్నలా కరిగిపోతుంది..

Keera Juice

Keera Juice

అధిక బరువు సమస్య ఈ రోజుల్లో ఎక్కువ మందిని భాదిస్తుంది.. శరీరం ఆకృతి లేకుండా ఎలా అంటే అలా ఉంటుంది..దానివల్ల చూడ్డానికి అసహ్యంగా ఉంటారు.. అలాంటి వాళ్ళు బరువు తగ్గాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. చివరికి ఇంటి చిట్కాలను ఫాలో అవుతారు.. అలాంటి వాళ్లు కీరా ను ట్రై చేయొచ్చు.. ఇప్పుడు కీరాను ఎలా వాడితే బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ చిట్కా కోసం.. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న కీరా దోసకాయను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీరా దోసకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే అంగుళం పొట్టు తొలగించిన అల్లం ముక్క, నాలుగైదు ఫ్రెష్ పుదీనా ఆకులు, ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.. దాన్ని ఒక గ్లాసులోకి వడగట్టు కోవాలి..

ఈ కీరా జ్యూస్లో నానబెట్టుకున్న చియా సీడ్స్ తో పాటు చిటికెడు మిరియాల పొడి కలిపి తాగేయాలి. ప్రతిరోజు ఉదయం ఈ కీరా జ్యూస్ ను తాగితే ఎంత లావుగా ఉన్నా సరే ఇట్టే సన్నబడతారు.. ఒంట్లో కరిగిపోతుంది.. ఈ జ్యూస్ ను రోజు ఉదయం పరగడుపున రోజూ తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గడంతో పాటు ఇంకా ఎన్నో సమస్యలు తగ్గుతాయి.. కీరా చర్మాన్ని పొడి భారకుండా చేస్తుంది.. సో బరువు తగ్గాలని అనుకొనేవాళ్లు ఇది ట్రై చెయ్యడం బెస్ట్..ఈ కీరా జ్యూస్ ను మార్నింగ్ రొటీన్ లో భాగం చేసుకోండి. పైగా నిత్యం ఈ కీరా జ్యూస్ ను తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి.. మీరు కూడా ట్రై చేసి చూడండి..

Exit mobile version