Weight Loss Tips in Summer: ప్రస్తుత జీవనశైలి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉద్యోగం, వ్యాపారం వల్ల సమయానికి తినకపోవడంతో ప్రజలు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయం కారణంగా మధుమేహం, హైబీపీ, థైరాయిడ్ వంటి వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. ఈ పరిస్థితిలో ప్రజలు బరువు తగ్గడానికి మంచి ఆహారాన్ని తీసుకుంటారు. ఇది వర్కౌట్ కానపుడు డైటింగ్, వ్యాయామంను ఎంపిక చేసుకుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో తెలియక జనాలు అయోమయంకు గురవుతున్నారు. కొంతమంది వ్యాయామం చేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారని నమ్ముతున్నారు?. మరి అందులో నిజం ఏంటో తెలుసుకుందాం.
బరువు తగ్గడం కోసం డైటింగ్ మరియు వ్యాయామం రెండూ అవసరమే. బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఒక్కటి మాత్రమే ఎంచుకుంటే సరిపోదు. ఎందుకంటే.. ఏ ఒక్కదానితో బరువు తగ్గలేరు. వ్యాయామం చేయడంతో పాటు సరైన ఆహారాన్ని తీసుకుంటేనే బరువు తగ్గవచ్చు. అయితే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటేనే.. చాలా వరకు బరువు తగ్గించుకోవచ్చని తేలింది. అందుకే మీ దినచర్యలో ఆరోగ్యకరమైన ఆహారంతో మరియు వ్యాయామాన్ని కూడా చేర్చుకోండి.
Also Read: Mint Leaves Benfits: పుదీనా ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. ఆ సమస్యతో బాధపడుతున్న వారు తప్పక తీసుకోవాలి!
వెయిట్ లాస్ టిప్స్ (Weight Loss Tips):
1. బరువు తగ్గాలంటే రోజూ 7 నుంచి 8 వేల అడుగులు నడవాలి. ఉదయం లేదా సాయంత్రం నడవొచ్చు.
2. 30 నుంచి 40 నిమిషాల పాటు మీ దినచర్యలో వ్యాయామ ప్రక్రియను చేర్చుకోవాలి.
3. వ్యాయామం కోసం సరైన సమయాన్ని ఎంచుకోవడం ముఖ్యం.
4. వ్యాయామంతో పాటు పీచు, ప్రొటీన్, కాల్షియం, విటమిన్-సి వంటి పోషకాలను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
5. ఉదయం, మధ్యాహ్నం మరియు రాత్రి సమయంలో సరైన భోజనం తీసుకోవాలి. రోజుకు 3 సార్లు పరిమిత పరిమాణంలో తినడం వల్ల మీ బరువు అదుపులో ఉంటుంది.