NTV Telugu Site icon

Weight Loss Tips : డైట్ చెయ్యకుండా బరువు తగ్గాలంటే వీటిని తీసుకోవాల్సిందే..

Weight Loss

Weight Loss

అధిక బరువు అనేది ఈరోజుల్లో పెద్ద సమస్యగా మారింది.. బరువు తగ్గాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కడుపు మాడ్చుకొన్ని మరీ డైట్ చేస్తారు.. అలా అవసరం లేకుండానే కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. మరి ఆలస్యం ఎందుకు ఎలాంటి ఫుడ్ ను తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

*. కాల్చిన మొక్కజొన్న చాలా రుచిగా ఉంటుంది. అందులో నిమ్మరసం, ఉప్పు కలిపితే దాని రుచి మరింత పెరుగుతుంది. ఇందులో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.. కానీ రెండు లేదా అంతకంటే ఎక్కువ మొక్కజొన్నలను ఎప్పుడూ కలిపి తినకూడదు.. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి..

*. సాయంత్రం టీ తాగాలని అనిపిస్తే, మిల్క్ టీకి బదులుగా హెర్బల్ టీ లేదా మసాలా టీ తాగడం ప్రారంభించండి. ఇది మీ కడుపు నుండి వేడిని తొలగిస్తుంది. మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో సాయపడుతుంది..

*. స్ప్రౌటెడ్ మూంగ్ చాట్ లేదా స్ప్రౌట్స్ చాట్ స్నాక్‌గా తినడానికి గొప్ప ఎంపిక. ఇది మీ శరీరానికి అత్యంత ఆరోగ్యకరమైన స్నాక్స్‌లో ఒకటి. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది..అలాగే తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది..

*. భేల్ పూరీని చిరుతిండిగా కూడా తినవచ్చు. ఇది టొమాటో, ఉల్లిపాయ, పఫ్డ్ రైస్, నిమ్మ, వేరుశెనగతో తయారు చేస్తారు. ఇది తింటే ఖచ్చితంగా రుచిగా ఉంటుంది.. ఇది అదనపు కొవ్వును తగ్గించడంతో పాటు బరువు కంట్రోల్లో ఉంచుతుంది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.