Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకోవడం చాలా మందికి ఉంటుంది. కానీ దాన్ని సాధించడం మాత్రం అందరికీ అంత సులభం కాదు. కొత్త కొత్త డైట్లు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వెయిట్ లాస్ టిప్స్, ఫ్యాడ్ డైట్లు, ఫాస్ట్ రిజల్ట్స్ అనే హామీలు చూసి చాలా మంది వాటిని ప్రయత్నిస్తుంటారు. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రావు. కొంత బరువు తగ్గినా మళ్లీ పెరిగిపోతుంటారు. సైకాలజీ టుడేలో ప్రస్తావించిన ఒక సర్వే ప్రకారం, సగటున ఒక వ్యక్తి తన జీవితకాలంలో 126 ఫ్యాడ్ డైట్లను ప్రయత్నిస్తాడని, అయితే ఒక్కో ప్రయత్నం సగటున కేవలం ఆరు రోజులు మాత్రమే కొనసాగుతుందని వెల్లడైంది.
బరువు తగ్గడం అంటే డైట్ కాదు… జీవనశైలిలో మార్పు
బరువు తగ్గడం అంటే కొన్ని రోజులు డైట్ చేయడం కాదు. అది జీవితాంతం కొనసాగించగలిగే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం. వేగంగా బరువు తగ్గాలనే ఆలోచన కంటే, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ క్రమంగా బరువు తగ్గడమే సరైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు వల్ల గుండెజబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనేక సమస్యలు వస్తాయని, అందుకే ఆరోగ్యకరమైన BMIని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
Also Read
- Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
- Cyclone Arnab: తుఫాను సమయంలో పొంచి ఉన్న 5 ప్రమాదాలు!
- Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
- How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
చిన్న చిన్న లక్ష్యాలే పెద్ద విజయానికి పునాది
బరువు తగ్గే ప్రయాణంలో మొదటి అడుగు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం. ఒక్కసారిగా ఎక్కువ బరువు తగ్గాలని కాకుండా, వారంలో ఐదు రోజులు 30 నిమిషాలు నడవడం, ప్రతి రోజు భోజనంలో కూరగాయలు చేర్చడం, రాత్రి ఆలస్యంగా తినడం మానేయడం వంటి చిన్న మార్పులు చేయాలి. స్మార్ట్ లక్ష్యాలను పెట్టుకుంటే వాటిని ఎక్కువకాలం కొనసాగించడం సులభమవుతుంది.
సహజమైన ఆహారమే ఆరోగ్యానికి అసలైన పెట్టుబడి
బరువు తగ్గడానికి తినే ఆహారంలో మార్పు చాలా అవసరం. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించి, పండ్లు, కూరగాయలు, ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలు, లీన్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి. కేవలం కేలరీలు తగ్గించడం కాకుండా, తీసుకునే ఆహారం నాణ్యతపై కూడా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు
చాలామంది వెయిట్ లాస్ కోసం కేకులు, స్వీట్లు, శీతల పానీయాలను పూర్తిగా మానేస్తారు. కానీ అలాంటి కఠిన నియమాలు ఎక్కువకాలం పాటించాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు ఇష్టమైన ఆహారం తినడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. బరువు తగ్గడం అనేది స్ప్రింట్ కాదు, మారథాన్ లాంటిదని ఆయన గుర్తు చేస్తున్నారు.
వ్యాయామం లేకుండా వెయిట్ లాస్ అసంపూర్ణం
బరువు తగ్గాలంటే తీసుకునే కేలరీల కంటే ఎక్కువ కేలరీలు ఖర్చు కావాలి. అందుకే ప్రతి వారం కనీసం 150 నిమిషాల మోస్తరు తీవ్రత కలిగిన కార్డియో వ్యాయామం చేయాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచిస్తోంది. నడక, ఈత, సైక్లింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
కండరాల బలం పెరిగితే కొవ్వు త్వరగా కరుగుతుంది
కార్డియోతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా అవసరం. కండరాలు ఎక్కువగా ఉంటే శరీరం విశ్రాంతిలో ఉన్నప్పటికీ ఎక్కువ కేలరీలు ఖర్చు చేస్తుంది. యోగా, వెయిట్ ట్రైనింగ్, కాలిస్థెనిక్స్ వంటి వ్యాయామాలను వారానికి కనీసం రెండుసార్లు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
మానసిక ఆరోగ్యాన్ని విస్మరిస్తే బరువు తగ్గడం కష్టం
ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి అంశాలు చాలామందిని అవసరానికి మించి తినేలా చేస్తాయి. దీనిని ఎమోషనల్ ఈటింగ్ అంటారు. అలాంటి సమయంలో ఫుడ్ డైరీ రాయడం ద్వారా తినే అలవాట్లు, వాటి వెనుక ఉన్న ఎమోషన్స్ గుర్తించవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.
నిద్ర కూడా వెయిట్ లాస్లో కీలక పాత్ర పోషిస్తుంది
తగినంత నిద్ర లేకపోతే ఆకలిని నియంత్రించే గ్రెలిన్, లెప్టిన్ హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో ఎక్కువ ఆకలి వేయడంతో పాటు అనారోగ్యకరమైన ఆహారం తినాలనే కోరిక పెరుగుతుంది. అందుకే ప్రతిరోజూ ఏడు నుంచి తొమ్మిది గంటల నాణ్యమైన నిద్ర అవసరం.
బరువు తగ్గడం ఒక్కసారిగా ఆగిపోతే భయపడొద్దు
మొదట్లో కొంచెం బరువు తగ్గినా, కొంతకాలం తర్వాత బరువు తగ్గడం ఆగిపోవడం సహజమే. దీనిని మెటబాలిక్ అడాప్టేషన్ అంటారు. ఇలాంటి సమయంలో వ్యాయామాన్ని పెంచడం, ఆహారాన్ని మరోసారి సమీక్షించుకోవడం, అవసరమైతే డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది. కొందరికి ఊబకాయ నిరోధక మందులు లేదా బేరియాట్రిక్ సర్జరీ కూడా ఉపయోగపడవచ్చు.
చివరగా… ఓపికే విజయానికి మూలం
బరువు తగ్గడం అనేది కొద్ది రోజుల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదు. శరీరం, ఆహారం, వ్యాయామం, నిద్ర, మానసిక ఆరోగ్యం అన్నీ కలిసి పనిచేసినప్పుడే మంచి ఫలితం కనిపిస్తుంది. త్వరగా బరువు తగ్గాలనే తొందరపడకుండా, క్రమశిక్షణతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటేనే తగ్గిన బరువును ఎక్కువకాలం నిలబెట్టుకోవడం సాధ్యమవుతుంది.
- Tags
- Fitness
- weight loss tips
తాజావార్తలు
-
Mouli: ఐదో తరగతిలో భయపడి ఏడ్చా.. ఇప్పుడు మైత్రీ మూవీస్‌తో సినిమా
-
Ashwini Vaishnaw : జర్నలిజానికి డీపీఎడీపీ చట్టంతో ముప్పు లేదు
-
BJP: ఎస్పీ గెలవకూడని చోట్ల గెలిచింది.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..
-
TGPSC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి 102 ఉద్యోగాలు!
-
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ టైంలో ట్రైన్లలో మొబైల్ ఛార్జింగ్ బంద్!
ట్రెండింగ్
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..