Site icon NTV Telugu

Weight Loss Mistakes: ఇలా చేస్తే ఎన్నేళ్లయినా బరువు తగ్గరు

Weight Loss Mistakes

Weight Loss Mistakes

Weight Loss Mistakes: బరువు తగ్గడం కొంచెం కష్టం. అయితే కొంచెం ట్రై చేస్తే తప్పకుండా ఫలితం దక్కుతుంది. కొంత మంది మాత్రం బరువు తగ్గేందుకు ముందు వెనుకా చూడకుండా కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇది మొదటికే మోసానికి దారితీస్తుందని మరిపోతుంటారు కొందరు. బరువు తగ్గడం కూడా అంత ఈజీ కాదు. బరువు పెరగడానికి తప్పులు ఏమిటో తెలుసుకుంటే వాటిని నివారించడం చాలా సులభం. అయితే మీరు బరువు తగ్గేందుకు ఇలా చేస్తుంటే మాత్రం అస్సలు తగ్గరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలని ప్రయత్నించినప్పుడు చాలామంది చేసే మొదటి పని తినడం మానేయడం. దీని వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. ఎందుకంటే ఎవరైనా ఆహారాన్ని తగ్గించుకుంటే, బరువు తగ్గడం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. అప్పుడు అనుకోని సమస్యలు వస్తాయి. అందుకే ముందుగా బరువు తగ్గాలంటే భోజనం మానేయడం కంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది. అంతేకాకుండా.. సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా ఎక్కువ పనికి చేయడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి కూడా అధిక వ్యాయామం అయినట్టు ఉంటుంది.

Read also: Traffic restrictions: రాజధానికి రాష్ట్రపతి రాక‌.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు

అంతేకాదు ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారని అనుకోకండి. వ్యాయామం తర్వాత, శరీరానికి విశ్రాంతి చాలా ముఖ్యం. ఇది తదుపరి వ్యాయామం కోసం కండరాలు సరిగ్గా కోలుకోవడానికి సహాయపడుతుంది. అతిగా వ్యాయామం చేయడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అతిగా తినడం కూడా సరికాదు. దీనికి కారణం మన శరీరాకృతి, ఆరోగ్య స్థితి, మనం తీసుకునే మందులు, ఏం తినాలి, ఎంత తినాలి. క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు పెరుగుతారని గుర్తుంచుకోండి. అదేవిధంగా, వ్యాయామం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని ఫిట్‌గా చేస్తుంది. త్వరగా బాడీ టోన్ పొందుతుంది. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బరువు తగ్గడంలో ఆరోగ్యకరమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఫాడ్ డైట్‌లను అనుసరించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి. అందరికీ కొత్త డైట్ సెట్ కాకపోవచ్చు. అందుకే మీ శరీరాకృతిని బట్టి ఎంత తినాలో తెలుసుకోవాలి. అలాగని కేవలం తినడమే కాదు.. మీరు తీసుకునే క్యాలరీల కంటే మీరు బర్న్ చేసే క్యాలరీలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అందుకే ఎలా తినాలో.. తిన్న తర్వాత ఏం చేయాలో నిపుణులను అడగాలి.
Earthquake: గౌహతితోపాటు మరికొన్ని ఈశాన్య ప్రాంతాల్లో భూకంపం

Exit mobile version