ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువును తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల చర్యలు తీసుకుంటుంటారు. కొంతమంది జిమ్‌లల్లో గంటల తరబడి చెమటలు చిందిస్తుంటే.. మరి కొంతమంది తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ డైటింగ్ చేస్తుంటారు… అయిన పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఇంటి చిట్కాలను పాలో అవుతున్నారు.. ఇప్పుడు అందరు ఇంటి చిట్కాలను పాటిస్తున్నారు .. ఈరోజు మనం మెంతులతో బరువు తగ్గడం ఎలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మెంతులు తినడం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు. మెంతి గింజల్లో అనేక పోషక లక్షణాలు ఉన్నాయి. అవి సూపర్ ఫ్యాట్ బర్నర్‌గా పనిచేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు..వీటిలో ఇందులో ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ, డి పుష్కలంగా ఉన్నాయి. మీరు మెంతి గింజలను క్రమంగా ఉపయోగిస్తే బరువు సులువుగా తగ్గుతుంది. మెంతుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది. శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. మెంతులు తినడం వల్ల డయాబెటిస్ రోగులకు చాలా ఉపయోగం కలుగుతుంది. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది..
మెంతి నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.. ఉదయం పరిగడుపున మెంతి నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి వేళ నిద్రపోయే ముందు ఒక గ్లాసులో కొన్ని మెంతి గింజలు వేసి నానా బెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని తాగితే సరిపోతుంది. లేకపోతే.. మెంతులను నీటిలో మరిగించి తాగాలి. ఇలా చేస్తే శరీరంలోని కొవ్వు మొత్తం మంచులా కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. మెంతులతో టీ ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
మెంతులు టీ : బరువు తగ్గడానికి మెంతుల్లో తేనె కూడా వాడవచ్చు. తేనె రోగనిరోధక శక్తిని పెంచేది. కావున మెంతులను నీటిలో మరిగించి.. తేనే కలిపి తాగవచ్చు. వాటికి కొంచెం నిమ్మరసం జోడిస్తే చేదు ఉండదు.. రోజు ఉదయం తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉన్నాయని చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.