ఈరోజుల్లో అందరు ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు.. బరువు పెరిగినంత సులువుగా బరువు తగ్గలేరు.. బరువు తగ్గే సమయంలో కంట్రోల్ చేసుకుంటే చాలు త్వరగా బరువు తగ్గవచ్చు. కొందరు బరువు తగ్గాలని ఆహారాన్ని తినడం మానేస్తే ఇంకా బరువు పెరుగుతారని కొన్ని అధ్యాయనాలు తెలుపుతున్నాయి.. డైట్ అంటే సరైన ఆహారాన్ని సరైన సమయంలో, సరైన మోతాదులో ఎంచుకోవడం. చాలా మంది చేసే సాధారణ తప్పులలో ఒకటి అల్పాహారం మానేయడం. అల్పాహారం చాలా అవసరం. రోజంతా చురుకుగా ఉండాలంటే అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి..
బరువు తగ్గాలనుకునే వారు బ్రేక్‌ఫాస్ట్‌లో ఏమేం తీసుకుంటారో జాగ్రత్తగా చూసుకోవాలి. కేలరీలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తినండి. బరువు తగ్గాలనుకునే వారి కోసం ఇక్కడ తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాలను ఇక్కడ వివరించాము.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఓట్స్.. ఈరోజుల్లో ఎక్కువ మంది వీటిని తింటున్నారు.. కేలరీలు తక్కువగానూ, పీచుపదార్థాలు ఎక్కువగానూ ఉంటాయి. దీంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఆదర్శవంతమైన అల్పాహారం. 1/4 కప్పు వోట్స్‌లో 1/2 కప్పు గోరువెచ్చని పాలు, కొంత తేనె, తరిగిన యాపిల్స్, స్ట్రాబెర్రీలు, నల్ల ద్రాక్ష, చెర్రీస్ వంటి పండ్లను జోడించి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది..
ఇడ్లీ సాంబార్ దక్షిణ భారత ప్రత్యేకత అల్పాహారం. బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే సాంబారుతో 2 ఇడ్లీలు తినాలి. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో 230 కేలరీలు ఉంటాయి..
యాపిల్ స్మూతి మిక్సీలో 2 యాపిల్స్ వేసి, 1 కప్పు పాలు పోసి, కొంచెం తేనె, 1/2 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి తాగాలి. తర్వాత దానితో పాటు 9-10 బాదం పప్పులను తినండి..
కోడి గుడ్డు.. ఉదయాన్నే తీసుకుంటే ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా ఉంటుంది. ఒక గుడ్డులో 78 కేలరీలు ఉంటాయి. అలాగే గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని మెటబాలిజంను పెంచి వేగంగా బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. అందుకే ఉదయం ఇవి రెండూ తీసుకోండి. ఒక గిన్నెలో 2 గుడ్లు పగలగొట్టి, అందులో కొన్ని ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిర్చి వేసి బాగా కలిపి, ఆమ్లెట్ పోసి తినండి.. ఇవే కాదు సూప్ లు కూడా తీసుకోవడం మంచిది.. కాల్చిన బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి.. త్వరగా బరువును తగ్గుతారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
