NTV Telugu Site icon

Wearing Tight Jeans: వేసవిలో జీన్స్ ధరిస్తున్నారా?

Sleeping With Jeans

Sleeping With Jeans

డెనిమ్‌ జీన్స్‌.. అంటే యువత ఎంతో ఇష్టపడతారు. ఏ సీజన్‌లోనైనా జీన్స్‌ ధరించడం మానరు. స్కిన్నీ ,స్ట్రెయిట్ లెగ్ జీన్స్, టైట్‌ జీన్స్‌, బూట్‌ కట్‌ జీన్స్‌, ఫ్లేర్‌ జీన్స్‌, క్యాప్రీ జీన్స్.. ఇలా జీన్స్‌లో ఎన్నో రకాల మోడళ్లు ట్రై చేస్తూ.. ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు. ఈ సింపుల్‌ ఎటైర్‌లో చాలా కంఫర్ట్‌గా ఫీల్‌ అవుతారు. మీకు ఎట్రాక్టివ్‌ లుక్‌ ఇచ్చే.. జీన్స్‌ తరచుగా ధరిస్తే.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వేసవిలో రోజంతా టైట్ జీన్స్ ధరించడం వల్ల అసౌకర్యంగా ఉంటుందని, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు సూచిస్తున్నారు. టైట్‌ జీన్స్‌‌ ధరిస్తే.. శరీరం దిగువ భాగానికి.. రక్తప్రసరణ కొంత కష్టమవుతుందని, కాళ్లు ఇతర ప్రాంతాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

READ MORE: Anchor Ravi : తప్పు చేశాం.. క్షమించండి.. ఎట్టకేలకు దిగొచ్చిన యాంకర్ రవి..

జీన్స్‌.. డెనిమ్‌ ఫ్యాబ్రిక్‌తో తయారవుతుంది. త్వరగా చెమటను పీల్చుకునే స్వభావం ఈ మెటీరియల్‌కు ఉండదు. అందులోనూ స్కిన్ టైట్ జీన్స్ అయితే ఇక చెప్పే పనే లేదు. ఫలితంగా జననేంద్రియాల వద్ద చెమట అలాగే ఉండిపోతుంది. ఈ తేమతోనే గంటల తరబడి ఉండిపోవడం వల్ల.. ఫంగల్‌ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఇది క్రమంగా ప్రత్యుత్పత్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే బిగుతైన దుస్తుల వల్ల ఆయా శరీర భాగాలకు గాలి తగలక.. అక్కడి చర్మంపై దురద, దద్దుర్లు, ఎరుపెక్కడం.. వంటి సమస్యలొస్తాయి. కాబట్టి సాధ్యమైనంత తక్కువ సమయం జీన్స్‌ ధరించేలా చూసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కాలంతో సంబంధం లేకుండా చెమట ఎక్కువగా వచ్చే వారు ఈ విషయంలో మరింత అలర్ట్‌గా ఉండడం మంచిదంటున్నారు.

READ MORE: Waqf Act: ‘‘తలలు పగలాలి, 10 మంది చావాలి’’.. వక్ఫ్ చట్టంపై హింసను ప్రేరేపించిన కాంగ్రెస్ నేత..

అంతే కాకుండా.. రోజంతా టైట్ జీన్స్ ధరించే పురుషులకు.. టెస్టిక్యులర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో ఇతర భాగాలతో పోలిస్తే.. వృషణాలు చల్లగా ఉంటాయి. తక్కువ ఉష్ణోగ్రతలో వృషణాలు.. వీర్యకణాలు ఉత్పత్తి చేస్తాయి. బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల.. వృషణాల ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని ఫలితంగా స్పెర్మ్‌ కౌంట్ తగ్గుతుంది. ఇది క్రమంగా టెస్టిక్యులర్‌ క్యాన్సర్‌ ముప్పు పెంచుతుందని నిపుణులు అంటున్నారు.