Site icon NTV Telugu

Alzheimer’s: వృద్ధాప్య దశలో జ్ఞాపక శక్తి తగ్గకుండా చేయవచ్చుంటున్న పరిశోధకులు

Untitled Design (20)

Untitled Design (20)

సాధారణంగా మనలో ఏజ్ పెరిగే కొద్ది జ్ఞాపక శక్తి తగ్గుతుందని పెద్దలు చెబుతుంటారు. అయితే చాలా మందికి ఈ మాటలతోనే సగం నిద్రను కొల్పోతుంటారు. వృద్ధాప్య దశలో జ్ఞాపక శక్తి తగ్గడం కామనే అని అంటున్నారు నిపుణులు.. మెదడులోని జ్ఞాపక కేంద్రమైన హిప్పోకాంపస్ ఏజ్ పెరిగే కొద్దీ కుంచించుకుపోవడం కూడా అందుకు కారణమవుతుంది. అయినప్పటికి అలా జరగకుండా ఆపవచ్చునని పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది.

Read Also:Hot Water Bath Facility: వందే భారత్ స్లీపర్ కోచ్ లో వేడి నీటి స్నానం..

అయితే ..జ్ఞాపక శక్తి తగ్గకుండా ఉండేందుకు రోజులో 40 నిమిషాలు వాకింగ్ చేయడంతో దీన్ని నియంత్రించవచ్చని నిపుణులు వెల్లడించారు. అధ్యయనంలో భాగంగా 120 మంది వృద్ధులను పరిశీలించారు. వారానికి మూడు సార్లు 40 నిమిషాలు వాకింగ్ చేస్తున్న వారిని ఒక సంవత్సరం పాటు పరిశీలించారు. అయితే ఏడాది తర్వాత వారి హిప్పోకాంపస్ 2% పెరిగిందని చెప్పుకొచ్చారు. పైగా ఈ మెదడు పెరుగుదల నేరుగా వారి జ్ఞాపకశక్తిని మెరుగుపరిచిందన్నారు. అందుకే నడక అంటే కేవలం కార్డియో వ్యాయామం మాత్రమే కాదు. అది మెదడుకు ఔషధం వంటిదని పరిశోధకులు సూచిస్తున్నారు. వృద్ధాప్యంలో సైతం అల్జీమర్స్ బారిన పడకుండా ఉండేందుకు, మెరుగైన జ్ఞాపక శక్తికి నడక చాలా ముఖ్యమని చెబుతున్నారు.

Exit mobile version