సాధారణంగా గ్రామాల్లో నివసించే మహిళలకు.. సిటీలో ఉండే మహిళకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వారి పద్దతులు, ఆహారపు అలవాట్లు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. గ్రామాల్లో మహిళలు.. చేసే పనుల వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. సీటిలో మహిళల ఆహారపు అలవాట్లు.. బిజీ లైఫ్ ఉండడంతో.. తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే.. గ్రామాల్లో చేసే పనులతో .. సిటీలో నివసిస్తున్న మహిళలకు జిమ్ సెంటర్ నిర్వాహాకులు ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది.
Read Also: HIV Cases: పారిశ్రామిక వాడలో రోజురోజుకు పెరుగు తున్న హెచ్ ఐవీ కేసులు..
గ్రామాల్లో ఆడవాళ్లు చేసే అన్ని పనులను.. ఎక్ససైజు లా చేయిస్తూ.. ఓ వీడియో తీసారు జిమ్ ట్రైనర్లు. ఈ వీడియోలో బట్టలు ఉతకడం.. అంట్లు తోమడం.. బాయిలో నీళ్లు చేదడం.. కట్టెల పొయ్యిలో పుల్లలు పెట్టి మంట తెప్పించడం, బయట నుంచి బిందెలతో నీళ్లు పట్టుకుని రావడం వంటి పనులు చేయించారు. మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ఎక్ససైజులన్నీ చేశారు. అయితే.. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు మాత్రం.. ఇలాంటి పనులు చేసిన మహిళలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని.. కామెంట్స్ పెడుతున్నారు.
Urban Women have finally found the best fitness routine pic.twitter.com/tDI9B4O01d
— Woke Eminent (@WokePandemic) November 16, 2025
