NTV Telugu Site icon

Shocking Survey: అబ్బాయిలూ.. పురుషాంగం క్లీన్ చేస్తున్నారా.. లేకపోతే శృంగారంలో..

Health

Health

Shocking Survey: ఇండియా లో శృంగారం గురించి బయట మాట్లాడడం పెద్ద నేరం. అయితే ఆ శృంగారం గురించి కానీ, ప్రైవేట్ పార్ట్స్ శుభ్రత గురించి కానీ పట్టించుకోకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. శృంగార సమయంలో జంట తమ ప్రైవేట్ పార్ట్స్ ను ఎంత క్లీన్ చేసుకుంటారో.. అంత హ్యాపీ శృంగారాన్ని.. అంతకన్నా ఎక్కువ ఆరోగ్యాన్ని పొందుతారని శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా అబ్బాయిల పురుషాంగంలో ఎక్కువ బ్యాక్టీరియాను కనుగున్నట్లు ఇండియానా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ సర్వేను బయట పెట్టారు. శృంగారంలో పాల్గొన్నప్పుడు స్త్రీ ప్రైవేట్ పార్ట్ నుంచే ఎక్కువ బ్యాక్టీరియా మగవారికి చేరుతుందట. స్త్రీ ప్రైవేట్ పార్టీ నుంచి వచ్చే ఆ బ్యాక్టీరియా అంతా మగవారి మూత్రాశయంలో పేరుకుపోతుందని చెప్పుకొచ్చారు.

ఇక ఈ బ్యాక్టీరియా వలనే లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు వ్యాపిస్తాయని, అంతేకాకుండా యూరినల్ ట్యూబ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు సైతం తెలపడం విశేషం. అందుకే శృంగార సమయంలోనూ, శృంగారం అవ్వగానే పురుషాంగాన్ని క్లీన్ చేసుకోవాలని వైద్యులతో పాటు శాస్త్రవేత్తలు కూడా సూచిస్తున్నారు. వీటికి వయస్సుతో సంబంధం లేదని.. 28 ఏళ్ళ నుంచి 92 ఏళ్ళు ఉన్న మగవారిలో లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు ఉంటాయని వారు తెలిపారు. ఈ అంటూ వ్యాధులు కనుక ఒక్కసారి వ్యాపించాయంటే.. శృంగారం చేసే సమయంలో మంట, రక్తం, మచ్చలు పడడం లాంటివి జరుగుతాయని వైద్యులు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆ బ్యాక్టీరియా రానివ్వకుండా ఉండాలంటే.. మగవారి ఎప్పటికప్పుడు తమ పురుషాంగాన్ని క్లీన్ చేసుకోవడం, శుభ్రంగా ఉంచడం చేస్తూ ఉండాలని తెలిపారు.

Show comments