America : భారతీయుల నెత్తిన మరో భారీ పిడుగు.. ఆందోళనలో లక్షలాది మంది పౌరులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America : అమెరికా కలలు… గ్రీన్ కార్డ్ ఆశలు… ఏళ్ల తరబడి ఎదురుచూపులు… ఇప్పుడు లక్షలాది భారతీయుల గుండెల్లో ఒక్కసారిగా ఆందోళన రేపుతున్నాయి. ఎన్నో కష్టాలు పడి అమెరికాలో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు… ఇక అక్కడే స్థిరపడాలని భావించిన వాళ్ళు … ఇప్పుడు ఊహించని షాక్ ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే భారతీయులకు సంబంధించిన ఈబీ 2 గ్రీన్ కార్డ్ కోటా పూర్తిగా ముగిసిపోయిందని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో వేలు కాదు… లక్షలాది మంది భారతీయుల భవిష్యత్తుపై మళ్లీ అనిశ్చితి మేఘాలు కమ్ముకున్నాయి.
అమెరికాలో ఉద్యోగం సంపాదించిన ప్రతి భారతీయుడి కలల్లో గ్రీన్ కార్డ్ ఒక పెద్ద లక్ష్యం. ముఖ్యంగా ఐటీ, టెక్నాలజీ, పరిశోధన రంగాల్లో పనిచేస్తున్న నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా అదే ఆశతో అక్కడ జీవిస్తున్నారు. అయితే ఇప్పుడు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ చేసిన తాజా ప్రకటన వారందరికీ తీవ్ర నిరాశను మిగిల్చింది. 2026 ఆర్థిక సంవత్సరానికి భారతీయులకు కేటాయించిన ఈబీ 2 కేటగిరీ గ్రీన్ కార్డులన్నీ ఇప్పటికే జారీ అయ్యాయని స్పష్టం చేసింది. అంటే ఈ ఏడాదిలో ఇక కొత్తగా ఈబీ 2 గ్రీన్ కార్డులు భారతీయులకు దక్కే అవకాశం లేనట్టే.
Also Read
- Masala Aloo Fries Recipe: మార్కెట్ ఫ్రెంచ్ ఫ్రైస్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే కరకరలాడే మసాలా ఆలూ ఫ్రైస్!
- Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
- Crash Dieting: సోషల్ మీడియా డైట్స్‌తో ప్రమాదం.. యువతకు వైద్యుల కీలక హెచ్చరిక
- Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది చూస్తే అమెరికా వలస విధానంలోని కఠినమైన కోటా వ్యవస్థే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అమెరికా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల కోసం ఒక పరిమితిని నిర్ణయిస్తుంది. మొత్తం 1 లక్షా 40 వేల గ్రీన్ కార్డులు మాత్రమే జారీ చేస్తుంది. ఇందులో కొంత భాగాన్ని ఈబీ 2 కేటగిరీకి కేటాయిస్తారు. అలాగే ఈబీ 1లో మిగిలిపోయిన వీసాలను కూడా ఇందులో కలుపుతారు. కానీ అసలు ఇబ్బంది దేశాల వారీగా అమల్లో ఉన్న 7 శాతం పరిమితి. ఈ నియమం వల్ల ఏ ఒక్క దేశానికీ నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ గ్రీన్ కార్డులు దక్కవు. దాంతో భారత్ లాంటి భారీ జనాభా కలిగిన దేశాలకు డిమాండ్ ఎంత ఎక్కువగా ఉన్నా అవకాశాలు మాత్రం చాలా తక్కువగానే మిగిలిపోతున్నాయి.
ఈ లెక్కల ప్రకారం భారతీయులకు ఈబీ 2 కేటగిరీలో దక్కే గ్రీన్ కార్డుల సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది. అయితే అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల సంఖ్య మాత్రం లక్షల్లో ఉంది. అందుకే దరఖాస్తులు పెరుగుతున్న కొద్దీ వెయిటింగ్ లిస్ట్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. అందుకే గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారిక గణాంకాల ప్రకారం పెండింగ్‌లో ఉన్న గ్రీన్ కార్డ్ దరఖాస్తుల్లో అత్యధిక సంఖ్య భారతీయులదే. సుమారు 7 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం వరుసలో ఉన్నారని ఇప్పటికే వెల్లడైంది. అంటే అమెరికా వలస విధానంలో అత్యధిక ప్రభావం పడుతున్న వర్గం భారతీయులేనని స్పష్టమవుతోంది.
ఇక మరోవైపు అమెరికాలో వలస నిబంధనలు మరింత కఠినతరం కావడం కూడా పరిస్థితిని క్లిష్టంగా మార్చుతోంది. ముఖ్యంగా నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులపై అమెరికా యంత్రాంగం స్క్రూటినీ పెంచుతోంది. పత్రాల పరిశీలన మరింత కఠినంగా మారుతోంది. ఇటీవల అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ విడుదల చేసిన తాజా మెమో కూడా వలసదారుల్లో కొత్త ఆందోళనకు కారణమైంది. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులు తమ స్వదేశం నుంచే అప్లై చేయాలని అందులో పేర్కొనడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ న్యాయపరమైన చిక్కులు వెంటాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మొత్తం మీద ఇప్పుడు అమెరికాలో స్థిరపడాలని ఆశిస్తున్న భారతీయ నిపుణుల పరిస్థితి మరింత అనిశ్చితిలో పడిపోయింది. ఏళ్ల తరబడి అక్కడ పనిచేస్తూ పన్నులు చెల్లిస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారిన వేలాది కుటుంబాలు ఇప్పుడు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా పిల్లల చదువులు, ఉద్యోగ భవిష్యత్తు, కుటుంబ స్థిరత్వం వంటి అంశాలు వారిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యే వరకు ఈ ఎదురుచూపులు తప్పే పరిస్థితి కనిపించడం లేదు. అప్పటివరకు అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లు భారతీయులకు కొత్త ఈబీ 2 వీసాలు జారీ చేసే అవకాశం కూడా లేదని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
-
Ration Card eKYC: మీరు ఈకేవైసీ పూర్తి చేశారా..? స్టేటస్‌ను సింపుల్‌గా తెలుసుకోండిలా..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!