NTV Telugu Site icon

చలికాలంలో పసుపు పాలు ఎంతో శ్రేష్టం

ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం మన చేతుల్లోనే వుంది. మన వంటిల్లే మంచి వైద్యశాల. ఏ ఆరోగ్య ఇబ్బంది అయినా మన వంటింట్లో దొరికే దినుసులతో నయం చేసుకోవచ్చు. వంటింట్లో మనం నిత్యం వాడేది ఎక్కువగా పసుపునే. పసుపు ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన పూర్వీకులు ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. అంతేకాదు పాలు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో వాడితే మీకు తెలియదు. మనం పాలు మామూలుగా తాగేకంటే అందులో కొద్దిగా పసుపు కలిపి మనం పసుపు పాలు తీసుకోవడం మంచిది.

దీనివల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలాంటి పాలపే క్రమం తప్పకుండా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్య నుంచి బయట పడొచ్చు. అంతేకాదు, చలికాలంలో తరచూ ఇబ్బంది పెట్టే దగ్గు, జలులు, గొంతు నొప్పి నుంచి సత్వరం ఉపశమనం పొందవచ్చు. దగ్గు, జలుబుతో బాధపడేవారు పసుపు పాలను తీసుకోవడం వల్ల వెంటనే తగ్గుతుంది.

పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శ్వాసకోశ వ్యాధులను దూరం చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. రోజూ పసుపు పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గోరు వెచ్చని పసుపు పాలు తీసుకోవడం వల్ల కఫం, ఇతర వాతంతో ఇబ్బంది పడే వారు దాని నుంచి బయటపడవచ్చు. పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి.

కీళ్ల వాపులు, నొప్పులు తగ్గాలంటే పసుపు పాలను క్రమం తప్పకుండా తాగడం మంచిది. అంతేకాదు తరచు పసుపు కలిపిన పాలు తాగడం వల్ల కామెర్లు తగ్గుతాయి. మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తాయి. పసుపు పాలు తాగడం వల్ల మహిళల్లో రక్తప్రసరణ పెరుగుతుంది. ముఖంలో వర్చస్సు వస్తుంది. మొటిమలు లాంటివి తగ్గుతాయి. చర్మంలో వుండే మలినాలు బయటకు వస్తాయి. కాబట్టి, మీరు రోజులో ఒక కప్పుపాలలో అయినా పసుపు కలుపుకుని తాగండి. పసుపు కొమ్ముల నుంచి తీసిన లేదా ఆర్గానిక్ పసుపుని వాడండి. మంచి ఫలితాలు మీకు లభిస్తాయి.