NTV Telugu Site icon

  Triphala: త్రిఫల నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Thri Fala

Thri Fala

త్రిఫల పొడి అనగా ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమం. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వివిధ రోగాల నివారణకు ఉపయోగిస్తారు. కాగా ఈ ఉసిరి, కరక్కాయ, తానికాయలను గిరిజనుల ద్వారా సేకరించి త్రిఫల చూర్ణం, రసం రూపంలో మార్కెట్లో అమ్ముతున్నారు. అయితే ఈ తిఫల.. ఆయుర్వేదం ఆరోగ్యానికి దివ్య ఔషధం. దీంతో శరీరంలోని అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో  పూర్తిగా తెలుసుకుందాం.

* ఉసిరి, కరక్కాయ, తానికాయ వంటి మూడు రకాల ఔషధాలు ఇందులో ఉండటం వల్ల దీనికి తిఫల అనే పేరు వచ్చింది. దీనిని తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా త్రిఫల ఫ్యాట్ బర్నర్ డ్రింక్ తాగడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా బలపడుతుంది. ముఖ్యంగా మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఔషధాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.  అలాగే అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది. వాత, పిత్త, కఫ దోషాలను కూడా ఈ త్రిఫల పానీయం నయం చేస్తుంది.

*అంతేకాదు… త్రిఫలను ఆహారంలో భాగంగా తీసుకుంటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది.. కళ్ల మసకబారడం కూడా తగ్గుతుంది. దూరం చూపు, దగ్గర చూపు తో బాధపడే వారు ఈ త్రిఫలను ఆహారంలో చేర్చుకుంటే మంచిది.

* ప్రతి రోజు త్రిఫల నీటిని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయి. దీంతో శరీరానికి అనేక సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో అనేక సీజనల్ సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. వేగవంతమైన జీవక్రియ కారణంగా, శరీరంలో కొవ్వు వేగంగా తగ్గుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది.శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకు పోకుండా ఉంటుంది.

* ఈ త్రిఫల పానీయాన్ని క్రమం తప్పకుండా తాగటం ద్వారా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను బయటకు పంపి, తద్వారా పొట్టను శుభ్రంగా ఉంచి, శరిరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో యాంటి బ్యాక్టిరియల్ లక్షణాలు ఉంటాయి. దీని కారణంగా దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

* అంతేకాదు నెలసరి సమస్యలతో బాధపడుతున్న ఆడవారు ఈ త్రిఫలను తీసుకుండే పిరియడ్స్ సమస్యలు కూడా తగ్గుతాయి. దీని వల్ల చర్మంలో మెరపు పెరుగి యవ్వనంగా కనబడతారు. ముడతలు, మచ్చలు వంటి సమస్యలు కూడా ఉండవు.