Health Tips: స్నానం ఎప్పుడు చేస్తే మంచిది.. ఉదయం లేదా సాయంత్రం..?
- ఏ సమయంలో స్నానం చేస్తే మంచిది..?
- నిపుణులు అభిప్రాయం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజువారీ పనుల హడావిడిలో మనం చేసే మొదటి పని స్నానం. కానీ.. అసలు ఎప్పుడు స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదనే విషయంలో మనలో చాలా మందికి రకరకాల సందేహాలు ఉంటాయి. కొందరు ఉదయం చేస్తేనే రోజంతా హుషారుగా ఉంటుందని నమ్మితే, మరికొందరు రాత్రి స్నానం చేస్తేనే హాయిగా నిద్ర పడుతుందని భావిస్తారు. నిజానికి స్నానం అనేది కేవలం ఒళ్లు కడుక్కోవడం మాత్రమే కాదు.. అది మన శరీర ఉష్ణోగ్రతను, మానసిక స్థితిని ప్రభావితం చేసే ఒక ప్రక్రియ. ఏ సమయంలో స్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో.. శాస్త్రీయంగా ఏది సరైనదో ఇక్కడ తెలుసుకుందాం.
ఉదయం Vs రాత్రి: స్నానానికి ఏది బెస్ట్ టైమ్..?
మన దేశంలో పూర్వకాలం నుంచి సూర్యోదయానికి ముందే స్నానం చేసే అలవాటు ఉంది. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో కూడా మెజారిటీ ప్రజలు ఉదయాన్నే స్నానం చేస్తారు. దీనివల్ల రాత్రి నిద్రలో పేరుకుపోయిన బద్ధకం వదిలి, మనసు ప్రశాంతంగా మారుతుంది. ముఖ్యంగా ఉదయాన్నే స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, రోజంతా పని చేయడానికి అవసరమైన శక్తి లభిస్తుంది.
Also Read
- Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
- Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
- Ragi Pindi Upma: డయాబెటిస్, వెయిట్ లాస్ కోసం బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. రాగి ఉప్మాను సింపుల్‌గా ఇలా చేసుకోండి!
- Ragi Barfi : ఈ ఒక్క స్వీట్ తింటే ఎముకలకు కొండంత బలం.. నోరూరించే రాగి బర్ఫీ సీక్రెట్ రెసిపీ!
Also Read:CSK: సీఎస్‌కు బిగ్ షాక్.. టీమ్ నుంచి మరో బిగ్ ప్లేయర్ ఔట్..
అయితే.. జపాన్, చైనా, కొరియా వంటి దేశాల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుంది. అక్కడ రాత్రిపూట స్నానం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీని వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయిజ రాత్రి పడుకోవడానికి గంటన్నర ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది మెదడుకు విశ్రాంతినిచ్చి, గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది. మనం బయట తిరిగినప్పుడు మన చర్మంపై దుమ్ము, ధూళి, కాలుష్య కారకాలు చేరుతాయి. రాత్రి స్నానం చేయకుండా పడుకుంటే ఇవన్నీ పరుపులకు అంటుకుని బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయి. రాత్రి స్నానం చేయడం వల్ల చర్మం శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటుంది. రోజంతా ఆఫీసు పనులు, ప్రయాణాల వల్ల కలిగే శారీరక, మానసిక అలసట రాత్రి స్నానంతో మాయమవుతుంది.
నిపుణులు ఏమంటున్నారు?
శాస్త్రీయ కోణంలో చూస్తే.. ఉదయం, రాత్రి రెండు సమయాల్లోనూ స్నానం చేయడం వల్ల వాటి ప్రత్యేక లాభాలు వాటికి ఉన్నాయి. మీరు జిమ్‌కు వెళ్లే వారైతే లేదా ఉదయాన్నే ఆఫీసుకి వెళ్లి యాక్టివ్‌గా ఉండాలనుకుంటే ఉదయం స్నానం మంచిది. ఒకవేళ మీరు బయట ఎక్కువ తిరిగే వారైతే లేదా మీకు నిద్రలేమి సమస్య ఉంటే రాత్రి స్నానం ఉత్తమమైన మార్గం. వాతావరణ పరిస్థితులు, మీ శరీర తత్వాన్ని బట్టి సమయాన్ని ఎంచుకోవాలి. వీలైతే రోజుకు రెండుసార్లు స్నానం చేయడం అన్నిటికంటే మేలైన పద్ధతి. దీనివల్ల అటు పరిశుభ్రతతో పాటు ఇటు సంపూర్ణ ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!