Kitchen Hacks: వర్కింగ్ ఉమెన్స్ కోసం కిచెన్ సీక్రెట్స్.. ఈ చిట్కాలతో వంట పని ఇక చిటికెలోనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Hacks: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిరోజూ మూడు పూటలా వంట చేయడం, ముఖ్యంగా కొత్తగా వంట నేర్చుకునే వారికి, ఉద్యోగం చేసే మహిళలకు పెద్ద సవాలుగా మారుతోంది. వంట గదిలో గంటల తరబడి సమయాన్ని వృధా చేయకుండా, స్మార్ట్‌గా, వేగంగా వంట ముగించడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలను తెలుసుకుందాం. క్రమశిక్షణ, చిన్నచిన్న మార్పులతో వంటను మరింత సులభంగా, సింపుల్‌గా ఎలా మార్చుకోవాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
* వంట చేసేటప్పుడు కటింగ్ బోర్డ్, చాకు వంటి వాటిని స్టౌ – సింక్‌కు అందుబాటులో ఉంచుకోవాలి. నిత్యం అవసరమయ్యే వస్తువులను చేతికి అందేలా పెట్టుకుంటే సమయం చాలా ఆదా అవుతుంది.
Also Read
- Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
* కేవలం చాకుతోనే అన్నీ కోయాలని చూస్తే సమయం వృధా అవుతుంది. చాపర్ (Chopper), గ్రేటర్ (Grater), మిన్సర్, సిజర్స్ వంటి పరికరాలను ఉపయోగిస్తే కూరగాయలను చాలా వేగంగా కట్ చేసుకోవచ్చు.
* వంట చేసేటప్పుడు ఎక్కువ గిన్నెలు కాకుండా, వీలైనంత వరకు ఒకే పాన్ లేదా కడాయిని ఉపయోగించాలి. ఉదాహరణకు షాహీ పనీర్ చేసేటప్పుడు ఒకే పాన్‌లో ఒకవైపు ఉల్లిపాయలు, మరోవైపు పనీర్ వేయించుకుని, ఆ తర్వాత అదే పాత్రలో గ్రేవీ చేసుకోవచ్చు. దీనివల్ల గిన్నెలు తోమే సమయం తప్పుతుంది.
* వంట వేగంగా అవ్వడానికి మంచి నాణ్యత గల ట్రై-ప్లై (Tri-ply) స్టెయిన్లెస్ స్టీల్ ప్రెజర్ కుక్కర్లు, పాత్రలను వాడాలి. ఇవి వంటను వేగంగా పూర్తి చేస్తాయి, అదే సమయంలో ఆహారం అడుగంటకుండా చూస్తాయి.
* ముందుగానే టొమాటో ప్యూరీ, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వంటివి తయారు చేసుకుని ఐస్ క్యూబ్ ట్రేలలో గడ్డకట్టించి, ఫ్రీజర్ బ్యాగుల్లో దాచుకోవాలి. ఆఫీసు నుంచి ఆలస్యంగా వచ్చినప్పుడు ఇవి వంటను నిమిషాల్లో క్లోజ్ చేయడానికి ఎంతో హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి.
* వంట చేసేటప్పుడు పక్కనే ఎలక్ట్రిక్ కెటిల్ లేదా స్టౌపై వేడి నీటిని రెడీగా ఉంచుకోవాలి. ఉప్మా, అన్నం లేదా పప్పు తాలింపులో చల్లటి నీటికి బదులు మరుగుతున్న నీటిని పోస్తే వంట చాలా వేగంగా ఉడుకుతుంది.
* వంట పూర్తయ్యాక అంతా ఒకేసారి శుభ్రం చేయాలంటే బద్ధకంగా ఉంటుంది. అందుకే కూర ఉడికే లోపు లేదా వంట మధ్యలో దొరికే ఖాళీ సమయంలోనే కిచెన్‌ను తూడ్చుకోవడం, గిన్నెలు కడగడం చేస్తే వంట పూర్తయ్యేసరికి కిచెన్ కూడా క్లీన్‌గా ఉంటుంది.
* కూరగాయలు కోసేటప్పుడు వాటి తొక్కలను నేరుగా కిచెన్ ప్లాట్‌ఫారమ్‌పై వేయకుండా, పక్కనే ఒక చిన్న గిన్నె లేదా డబ్బా పెట్టుకుని అందులో వేయాలి. దీనివల్ల కౌంటర్‌టాప్ మురికి కాకుండా ఉంటుంది.
* భారతీయ వంటకాల్లో ఉపయోగించే పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా వంటి వాటిని మీ రుచికి తగిన రేషియోలో ముందే ఒకే డబ్బాలో మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. కూరలు చేసేటప్పుడు విడివిడిగా వేసే పని లేకుండా ఈ ఒక్క ప్రీ-మిక్స్ వేస్తే సరిపోతుంది.
* ముందు రోజు మిగిలిన అన్నం, కట్ చేసిన కూరగాయలు, దోస పిండి వంటివి ఫ్రిజ్‌లో ఉంటే అత్యవసర సమయాల్లో 5 నిమిషాల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్, సాంబార్ లేదా ఊతప్పం వంటివి చేసుకోవచ్చు. అయితే ఆహారం వృధా కాకుండా చూసుకోవాలి.
* ఫ్రిజ్‌లో వస్తువులను వెతుక్కునే పని లేకుండా వాటిని కేటగిరీల వారీగా సర్దుకోవాలి. రోజువారీ అవసరమయ్యే అల్లం, వెల్లుల్లి, నిమ్మకాయలు, కొత్తిమీర ఒక వైపు.. పాలు, పెరుగు, పిండి వంటివి ఒక వైపు సర్దుకుంటే టైం చాలా ఆదా అవుతుంది.
* ఆలూ ఫ్రై, బెండకాయ ఫ్రై వంటివి క్రిస్పీగా, త్వరగా అవ్వాలంటే చిన్న కడాయిల కంటే వెడల్పాటి పాత్రలను వాడాలి. అలాగే వంటపై మూత (Lid) పెట్టడం వల్ల లోపల వేడి పెరిగి కూరగాయలు త్వరగా మగ్గుతాయి.
ఈ చిన్న చిన్న అలవాట్లను మీ లైఫ్ స్టైల్లో భాగం చేసుకుంటే వంట గదిలో మీ పని మరింత సులభం కావడం ఖాయం.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!