Milk Storage Tips: వేసవిలో పాలు విరిగిపోతున్నాయా..? ఈ చిన్న చిట్కాలతో తాజాగా నిల్వ చేసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Milk Storage Tips: వేసవికాలంలో ఇంటిల్లిపాదిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో పాలు విరిగిపోవడం ఒకటి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో పాలలో బ్యాక్టీరియా వేగంగా పెరిగి, మరిగించేలోపే పాలు పాడైపోతుంటాయి. ముఖ్యంగా ఉదయం తీసుకొచ్చిన పాలు కొద్దిసేపటికే విరిగిపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను సులభంగా నివారించవచ్చు.
అయితే, పాలు కొద్దిగా పాతబడ్డాయని అనిపించినా, బయట ఎక్కువ వేడి ఉన్నా పాలు మరిగించే సమయంలో అందులో చిటికెడు బేకింగ్ సోడా లేదా స్వీట్ సోడా కలపడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది పాలలో పెరిగే లాక్టిక్ ఆమ్లాన్ని సమతుల్యం చేసి, పాలు విరిగిపోకుండా సహాయపడుతుంది. వేడి కారణంగా పాలలో ఆమ్లత్వం పెరిగితే పాలు త్వరగా పాడైపోతాయి. బేకింగ్ సోడాలో ఉండే క్షార గుణం పాల pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. దీంతో పాలు ఎక్కువసేపు తాజాగా నిల్వ ఉండే అవకాశం ఉంటుంది.
Also Read
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
ఇక, పాలను నిల్వ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ప్యాకెట్ పాలు అయినా, డెయిరీ నుంచి తీసుకొచ్చిన పాలు అయినా వెంటనే మరిగించడం మంచిది. ఎక్కువసేపు బయట ఉంచితే పాలు త్వరగా పాడవుతాయి. మరిగించిన వెంటనే వేడి పాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ముందుగా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి. లేదంటే ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రత పెరిగి ఇతర ఆహార పదార్థాలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంటుంది.
పాలు మరిగించే పాత్ర కూడా పూర్తిగా శుభ్రంగా ఉండాలి. పాత్రలో స్వల్పంగా పులుపు లేదా మిగిలిన ఆహార అవశేషాలు ఉన్నా పాలు విరిగిపోవచ్చు. అలాగే గిన్నెలో ముందుగా కొద్దిగా నీరు పోసి తర్వాత పాలు వేయడం వల్ల పాలు అడుగున అంటుకోకుండా ఉంటాయి. మాడిన వాసన కూడా రాదు. మొత్తంగా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో కూడా పాలను తాజాగా, సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు