Monkey Control Tips: కోతులు ఇబ్బంది పెడుతున్నాయా..? శాశ్వతంగా తరిమికొట్టే అద్భుతమైన చిట్కాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monkey Control Tips: రోజు రోజుకు అంతరించిపోతున్న పంటపొలాలు, అడవులతో కోతులు ఇప్పుడు సమీపంలోని పట్టణాలు, గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి.. ఇళ్ల పైకప్పులు, బాల్కనీలు, టెర్రస్‌లపై కోతుల సంచారం పెరుగుతుంది. ఇవి మొక్కలను ధ్వంసం చేయడమే కాకుండా, ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను పాడుచేయడం కూడా సాధారణంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు చిన్నపిల్లలు, వృద్ధులపై కూడా దాడి చేసే ప్రమాదం ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, కోతులను ఎలాంటి హాని కలిగించకుండా దూరంగా ఉంచేందుకు కొన్ని శాస్త్రీయ, సులభమైన పద్ధతులు ఉన్నాయని అంతర్జాతీయ వన్యప్రాణి నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ బాల్కనీ, టెర్రస్‌ను కోతుల నుంచి రక్షించుకోవచ్చు.
ఘాటైన వాసనలు కోతులకు అసహ్యం
కోతులకు వాసన పసిగట్టే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల ఘాటైన వాసనలను అవి అస్సలు ఇష్టపడవు. నిపుణుల సూచనల ప్రకారం, వెనిగర్ లేదా వెల్లుల్లి రసాన్ని బాల్కనీ, టెర్రస్ మూలల్లో చల్లడం వల్ల కోతులు ఆ ప్రాంతానికి రావడానికి వెనుకాడతాయి. అలాగే వెనిగర్‌లో నానబెట్టిన దూది గుడ్డలు లేదా జనపనార సంచులను రెయిలింగ్‌లకు కట్టడం ద్వారా కూడా కోతులను దూరంగా ఉంచవచ్చు. ఈ వాసన సహజ నివారిణిగా పనిచేస్తుంది.
Also Read
- Pandu Mirapakaya Pachadi: ఏడాది దాటినా అదే ఘాటు, అదే రుచి! పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఇలా పెట్టేయండి..
- Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
- Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
బొమ్మ పాములతో భయపెట్టండి
కోతులకు పాములంటే సహజసిద్ధంగా భయం ఉంటుంది. ఈ లక్షణాన్ని ఉపయోగించుకుని మార్కెట్లో లభించే పెద్ద ప్లాస్టిక్ లేదా రబ్బరు పాములను టెర్రస్‌పై, బాల్కనీలో లేదా చెట్ల కొమ్మల వద్ద ఉంచితే కోతులు ఆ ప్రాంతానికి చేరువ కావడానికి భయపడతాయి. వన్యప్రాణి నియంత్రణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాముల మాదిరిగా కనిపించే బొమ్మలు కోతులను భయపెట్టి దూరంగా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
మెరిసే, కదిలే వస్తువులు కూడా ఉపయోగకరం
కోతులు ఆకస్మికంగా కదిలే లేదా మెరిసే వస్తువులను చూసి అసౌకర్యంగా భావిస్తాయి. అందుకే బాల్కనీలో పాత సీడీలు, రిఫ్లెక్టివ్ టేపులు లేదా అల్యూమినియం ఫాయిల్ ముక్కలను వేలాడదీయాలని నిపుణులు సూచిస్తున్నారు. గాలి వీచినప్పుడు ఇవి కదలడంతో పాటు కాంతిని ప్రతిబింబిస్తాయి. దీంతో కోతులు భయపడి ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లే అవకాశం ఉంటుంది.
జాగ్రత్తలే ఉత్తమ పరిష్కారం
కోతుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆహార పదార్థాలను బయట ఉంచకపోవడం, చెత్తను మూత ఉన్న డబ్బాల్లో వేయడం, టెర్రస్‌లపై పండ్లు లేదా తినుబండారాలు వదిలేయకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చర్యలతో పాటు పై చిట్కాలను పాటిస్తే కోతుల బెడదను గణనీయంగా తగ్గించుకోవచ్చు. కాగా, గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఊళ్లలో.. సమీపంలోని పట్టణాల్లో కోతుల బెడద ఎక్కువైంది.. చివరకు ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. కోతులను తరిమేస్తామంటూ హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచినవారు కూడా లేకపోలేదు..
తాజావార్తలు
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ కసరత్తు.. అభ్యర్థుల ఖరారుపై మాజీ సీఎం జగన్ కీలక సూచనలు..
-
Sheetalnath Temple: కాశ్మీర్లో 36 ఏళ్ల తర్వాత తెరుచుకున్న శీతల్నాథ్ ఆలయం..
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!