Mixer Jar: మిక్సీ తిప్పినప్పుడల్లా మూత ఊడిపోతోందా? రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా టైట్ చేసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mixer Jar: వంటగదిలో ప్రతిరోజూ అత్యధికంగా ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులలో మిక్సర్ గ్రైండర్ (మిక్సీ) ఒకటి. మసాలాలు నూరాలన్నా, చట్నీలు చేయాలన్నా, జ్యూస్‌లు పట్టుకోవాలన్నా మిక్సీ ఉండాల్సిందే. అయితే దీనిని నిరంతరం ఉపయోగించడం వల్ల తరచూ మిక్సీ జార్ మూత లూజ్ అయిపోతుంటుంది. దీంతో మిక్సీ ఆన్ చేయగానే లోపల ఉన్న పదార్థాలు బయటకు చిమ్మి ఇల్లంతా గందరగోళం అవుతుంది. దీంతో మిక్సీ తిప్పినంత సేపూ మూతను చేత్తో గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది. చాలామంది ఈ సమస్య రాగానే కొత్త జార్ కొనడమో లేదా మెకానిక్ దగ్గరకు పరిగెత్తడమో చేస్తుంటారు. కానీ ఎలాంటి మెకానిక్ సహాయం లేకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే లూజ్ అయిన మిక్సీ జార్ మూతను సరికొత్త దానిలా టైట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మిక్సీ జార్ మూత లూజ్ అవ్వడానికి ప్రధాన కారణం దానికి ఉండే రబ్బర్ గ్యాస్కెట్ (రబ్బర్ రింగ్) సాగిపోవడమే. దీన్ని ఫిక్స్ చేయడానికి.. ముందుగా మూతకున్న రబ్బర్‌ను విడిగా తీసి, బాగా మరుగుతున్న వేడి నీళ్లలో కాసేపు వేయండి. ఆ వెంటనే దానిని తీసి, ఐస్ ముక్కలు ఉన్న చల్లటి నీళ్లలో 5 నుంచి 10 నిమిషాల పాటు ఉంచాలి. ఉష్ణోగ్రతలో వచ్చే ఈ హఠాత్తు మార్పు వల్ల సాగిపోయిన రబ్బర్ తిరిగి ముడుచుకుని తన పాత సైజుకు వచ్చేస్తుంది. దీంతో మూత జార్కి పక్కాగా ఫిట్ అవుతుంది.
Also Read
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
మిక్సీ జార్ పైభాగంలో (మూత పెట్టే చోట) ఒకటి లేదా రెండు లావుపాటి రబ్బర్ బ్యాండ్లను గట్టిగా చుట్టేయండి. ఆ తర్వాత మూత పెట్టండి. ఈ రబ్బర్ బ్యాండ్లు అదనపు గ్రిప్‌ను ఇస్తాయి. దీనివల్ల మిక్సీ ఎంత స్పీడ్‌గా తిరిగినా మూత అస్సలు కదలదు. మీకు సమయం తక్కువగా ఉండి, అర్జంట్‌గా మిక్సీ పట్టుకోవాల్సిన సమయంలో ఈ ట్రిక్ బాగా పనిచేస్తుంది.
ఈ సమస్యకు మరో శాశ్వత పరిష్కారం ఏంటంటే.. జార్ మూతకున్న రబ్బర్ రింగ్‌ను బయటకు తీయాలి. ఇప్పుడు ఆ మూతకు రబ్బర్ కూర్చునే గాడిలో లావుపాటి కాటన్ దారం లేదా సెల్లో టేప్‌ను రెండు మూడు రౌండ్లు చుట్టాలి. ఆ తర్వాత దానిపై మళ్లీ రబ్బర్ రింగ్‌ను ఎప్పటిలాగే ఫిట్ చేయాలి. ఇలా చేయడం వల్ల రబ్బర్ కొద్దిగా బయటకు నెట్టబడి, జార్‌పై మూత చాలా గట్టిగా, గ్రిప్‌గా కూర్చుంటుంది. ఇకపై మీ ఇంట్లో మిక్సీ జార్ మూత లూజ్ అయితే కంగారు పడి కొత్తది కొనకుండా.. వెంటనే ఈ సింపుల్ స్మార్ట్ కిచెన్ హ్యాక్స్ ట్రై చేసి చూడండి.
తాజావార్తలు
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు