Site icon NTV Telugu

Kitchen Tips: మీ పెనం నల్లబడిందా..? ఏళ్ల మసి నిమిషాల్లో మాయం.. కొత్తదానిలా మెరిపించే సూపర్ చిట్కాలు..!

How To Clean A Blackened Ir

How To Clean A Blackened Ir

Kitchen Tips: వంటగదిలో ఇనుప పెనాలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా దోశలు, రోటీలు, పరాటాలు చేయడానికి ఇవి ఎంతో పనికివస్తాయి. అయితే, కాలక్రమేణా నూనె, మాడిన ఆహారం, కార్బన్ మలినాలు పేరుకుపోయి పెనం పూర్తిగా నల్లబడిపోతుంది. ఎంత సబ్బుతో తోమినా శుభ్రం కాక చాలా మంది కొత్త పెనం కొనాలని భావిస్తారు. కానీ, ఇంట్లోనే ఉండే కొన్ని సాధారణ పదార్థాలతో పాత పెనాన్ని మళ్లీ కొత్తదానిలా మెరిపించవచ్చు. ఇప్పుడు ఆ సులభమైన చిట్కాలు తెలుసుకుందాం.

బేకింగ్ సోడా – వెనిగర్‌తో మసి తొలగింపు
పెనంపై గట్టిగా పేరుకుపోయిన మసిని తొలగించడానికి బేకింగ్ సోడా, తెల్ల వెనిగర్ చాలా బాగా పనిచేస్తాయి… ముందుగా పెనాన్ని కొద్దిగా వేడి చేయాలి. అందులో 2 టీస్పూన్లు బేకింగ్ సోడా చల్లాలి. తర్వాత వెనిగర్ పోయాలి. వెంటనే నురుగు రావడం ప్రారంభమవుతుంది. 15 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత స్టీల్ స్క్రబ్బర్‌తో రుద్దాలి. ఇలా చేస్తే గట్టిగా పేరుకున్న మసి పొరలుగా ఊడిపోతుంది.

ఉప్పు – నిమ్మకాయతో పాత మసికి చెక్
మసి చాలా పాతదై ఉంటే ఉప్పు, నిమ్మకాయ చిట్కా బాగా ఉపయోగపడుతుంది.. అయితే, పెనం మీద దొడ్డు ఉప్పు చల్లాలి. సగం నిమ్మకాయ తీసుకుని గట్టిగా రుద్దాలి.. ఉప్పు రాపిడి పదార్థంలా పనిచేస్తుంది. నిమ్మరసం మలినాలను కరిగిస్తుంది. దీంతో పెనం మళ్లీ మెరుస్తుంది.

శుభ్రం చేసిన తర్వాత ఇలా చేయాలి
పెనాన్ని శుభ్రం చేసిన వెంటనే నీటిలో ఎక్కువసేపు ఉంచకండి. ఇనుముకు తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. గుడ్డతో పూర్తిగా తుడవాలి.. పొయ్యిపై పెట్టి ఆరబెట్టాలి.. కొద్దిగా వంట నూనె రాయాలి.. ఇలా చేస్తే పెనం ఎక్కువకాలం బాగుంటుంది.

పెనం అంటుకోకుండా ఉండాలంటే
శుభ్రం చేసిన తర్వాత నూనె రాసి సీజనింగ్ చేస్తే రోటీలు, పరాటాలు, దోశలు పెనానికి అంటుకోవు. వంట కూడా సులభంగా అవుతుంది. మొత్తంగా ఏళ్ల తరబడి పేరుకుపోయిన నల్లటి మసి కారణంగా పెనం మార్చేయాల్సిన అవసరం లేదు. బేకింగ్ సోడా, వెనిగర్, ఉప్పు, నిమ్మకాయ వంటి సాధారణ పదార్థాలతో నిమిషాల్లో శుభ్రం చేసి కొత్తదానిలా మెరిపించవచ్చు. ఇక మీ పాత పెనం మళ్లీ వంటగదిలో స్టార్ అవుతుంది.

Exit mobile version