Kitchen Tips: మీ పెనం నల్లబడిందా..? ఏళ్ల మసి నిమిషాల్లో మాయం.. కొత్తదానిలా మెరిపించే సూపర్ చిట్కాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Tips: వంటగదిలో ఇనుప పెనాలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా దోశలు, రోటీలు, పరాటాలు చేయడానికి ఇవి ఎంతో పనికివస్తాయి. అయితే, కాలక్రమేణా నూనె, మాడిన ఆహారం, కార్బన్ మలినాలు పేరుకుపోయి పెనం పూర్తిగా నల్లబడిపోతుంది. ఎంత సబ్బుతో తోమినా శుభ్రం కాక చాలా మంది కొత్త పెనం కొనాలని భావిస్తారు. కానీ, ఇంట్లోనే ఉండే కొన్ని సాధారణ పదార్థాలతో పాత పెనాన్ని మళ్లీ కొత్తదానిలా మెరిపించవచ్చు. ఇప్పుడు ఆ సులభమైన చిట్కాలు తెలుసుకుందాం.
బేకింగ్ సోడా – వెనిగర్‌తో మసి తొలగింపు
పెనంపై గట్టిగా పేరుకుపోయిన మసిని తొలగించడానికి బేకింగ్ సోడా, తెల్ల వెనిగర్ చాలా బాగా పనిచేస్తాయి… ముందుగా పెనాన్ని కొద్దిగా వేడి చేయాలి. అందులో 2 టీస్పూన్లు బేకింగ్ సోడా చల్లాలి. తర్వాత వెనిగర్ పోయాలి. వెంటనే నురుగు రావడం ప్రారంభమవుతుంది. 15 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత స్టీల్ స్క్రబ్బర్‌తో రుద్దాలి. ఇలా చేస్తే గట్టిగా పేరుకున్న మసి పొరలుగా ఊడిపోతుంది.
Also Read
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
- Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే "మినప జంతికలు" చేసేయండి ఇలా..!
- How to Choose Sweet Apples: యాపిల్ కొనేటప్పుడు రంగు చూసి మోసపోవద్దు.. తియ్యటి పండు కోసం సింపుల్ చిట్కాలు
- Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే 'సొరకాయ సర్వపిండి' తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
ఉప్పు – నిమ్మకాయతో పాత మసికి చెక్
మసి చాలా పాతదై ఉంటే ఉప్పు, నిమ్మకాయ చిట్కా బాగా ఉపయోగపడుతుంది.. అయితే, పెనం మీద దొడ్డు ఉప్పు చల్లాలి. సగం నిమ్మకాయ తీసుకుని గట్టిగా రుద్దాలి.. ఉప్పు రాపిడి పదార్థంలా పనిచేస్తుంది. నిమ్మరసం మలినాలను కరిగిస్తుంది. దీంతో పెనం మళ్లీ మెరుస్తుంది.
శుభ్రం చేసిన తర్వాత ఇలా చేయాలి
పెనాన్ని శుభ్రం చేసిన వెంటనే నీటిలో ఎక్కువసేపు ఉంచకండి. ఇనుముకు తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. గుడ్డతో పూర్తిగా తుడవాలి.. పొయ్యిపై పెట్టి ఆరబెట్టాలి.. కొద్దిగా వంట నూనె రాయాలి.. ఇలా చేస్తే పెనం ఎక్కువకాలం బాగుంటుంది.
పెనం అంటుకోకుండా ఉండాలంటే
శుభ్రం చేసిన తర్వాత నూనె రాసి సీజనింగ్ చేస్తే రోటీలు, పరాటాలు, దోశలు పెనానికి అంటుకోవు. వంట కూడా సులభంగా అవుతుంది. మొత్తంగా ఏళ్ల తరబడి పేరుకుపోయిన నల్లటి మసి కారణంగా పెనం మార్చేయాల్సిన అవసరం లేదు. బేకింగ్ సోడా, వెనిగర్, ఉప్పు, నిమ్మకాయ వంటి సాధారణ పదార్థాలతో నిమిషాల్లో శుభ్రం చేసి కొత్తదానిలా మెరిపించవచ్చు. ఇక మీ పాత పెనం మళ్లీ వంటగదిలో స్టార్ అవుతుంది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?