Homemade Face Pack: పార్లర్ మెరుపు కావాలా? పాల మీగడతో ఈ చిట్కా ట్రై చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Homemade Face Pack: అందమైన, మెరిసే చర్మం కోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌నే ఆశ్రయించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోనే సులభంగా దొరికే పాల మీగడ (క్రీమ్), బంగాళాదుంప రసంతో తయారు చేసే ఫేస్ ప్యాక్ చర్మానికి సహజమైన మెరుపును అందించడంలో సహాయపడుతుంది. చర్మానికి సరిపడితే ఈ చిట్కా మృదుత్వం, తేమను కాపాడటంలో ఉపయోగపడుతుంది.
పాల మీగడ ఎందుకు మంచిది?
పాల మీగడలో ఉండే లాక్టిక్ యాసిడ్ మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే సహజ కొవ్వు చర్మానికి తేమను అందించి మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
Also Read
- Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
- World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
- Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
- Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
బంగాళాదుంప రసం వల్ల కలిగే ప్రయోజనాలు
బంగాళాదుంప రసంలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో చర్మం తాజాగా కనిపించేందుకు దోహదపడుతుంది. టానింగ్, పిగ్మెంటేషన్, చిన్న చిన్న మచ్చలు తగ్గించేందుకు గృహ చిట్కాల్లో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే ఫలితాలు వ్యక్తి చర్మ తత్వాన్ని బట్టి మారవచ్చు.
ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి?
ఒకటి లేదా రెండు టీస్పూన్ల తాజా పాల మీగడలో కొద్దిగా తాజా బంగాళాదుంప రసం వేసి బాగా కలపాలి. బంగాళాదుంప రసం సరిపడని వారికి బియ్యం కడిగిన నీటిని ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
ఎలా ఉపయోగించాలి?
ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడిగి, ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై సమానంగా రాయాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడిగి, చివరగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండు నుంచి మూడు సార్లు ఉపయోగించవచ్చు.
తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం
ప్రతి ఒక్కరి చర్మ తత్వం వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ ఇంటి చిట్కాను ఉపయోగించే ముందు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేయాలి. దురద, మంట, ఎరుపు లేదా అలర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వాడటం ఆపేయాలి. తీవ్రమైన చర్మ సమస్యలు ఉన్నవారు చర్మవ్యాధి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కొత్త బాదుడుపై ఒక లుక్ వేయండి!
-
Murasu Cyclone : ఏపీ వైపు మురసు తుఫాన్.. 120 కి.మీ. వేగంతో గాలులు
-
Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!
-
Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
-
Mallikarjun Kharge: జ్ఞానేష్ కుమార్ ఎక్కడ దాక్కున్నా వదలం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!