Summer Kitchen Tips: వేసవిలో కిచెన్‌లో ఉండలేకపోతున్నారా..? ఈ చిట్కాలతో ఏసీ లేకుండానే మీ వంటగది కూల్‌గా మారిపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Summer Kitchen Tips: వేసవి కాలం మొదలైతే ఇంటి అంతా వేడెక్కిపోతుంది. అయితే ఇంట్లో అన్నిటికంటే ఎక్కువ వేడి ఉండే ప్రదేశం వంటగదే.. బయట ఎండ వేడి, లోపల గ్యాస్ స్టవ్ వేడి కలిసి కిచెన్‌ను తందూర్‌లా మార్చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వంట చేయడం మహిళలకు చాలా కష్టంగా మారుతుంది. చెమటలు పట్టడం, అలసట రావడం, ఎక్కువసేపు నిలబడలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.. దీంతో, మహిళలు వంట గది అంటేనే భయపడాల్సిన పరిస్థితి..
చాలా ఇళ్లలో వంటగదిలో ఏసీ, కూలర్ లేదా పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. అయితే, కొన్ని చిన్న మార్పులు, తెలివైన అలవాట్లు పాటిస్తే ఏసీ లేకుండానే కిచెన్‌ను చల్లగా ఉంచుకోవచ్చు. అలాంటి 6 సులభమైన చిట్కాలు మీ కోసం..
Also Read
- Touching Elders Feet: పెద్దల కాళ్లకు నమస్కారం చేయడం.. కేవలం సంప్రదాయమేనా.! శాస్త్రీయ కోణం కూడా ఉందా.?
- 5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
- Empty Medicine Packets Reuse: ఖాళీ టాబ్లెట్ స్ట్రిప్స్‌తో ఎన్నో లాభాలు.. ఈ విషయం తెలిస్తే పొరపాటున కూడా చెత్తబుట్టలో వేయరు..
- Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
1. సరైన సమయంలో కిటికీలు తెరవండి, మూయండి: ఉదయం, సాయంత్రం సమయాల్లో కిచెన్ కిటికీలు తెరిచి ఉంచితే స్వచ్ఛమైన గాలి లోపలికి వస్తుంది. దీంతో వంటగది తాజాగా ఉంటుంది. కానీ మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు కిటికీలు మూసివేయడం మంచిది. అలా చేస్తే వేడి గాలి లోపలికి రాదు.
2. ఉదయాన్నే వంట పూర్తి చేయండి: వేసవిలో మధ్యాహ్నానికి కిచెన్ ఎక్కువగా వేడెక్కుతుంది. అందుకే వీలైతే ఉదయం సమయంలోనే వంట పూర్తి చేయడం మంచిది. దీంతో మండే వేడిలో వంట చేయాల్సిన అవసరం ఉండదు.
3. వంటగదిని శుభ్రంగా ఉంచండి: కిచెన్‌లో అవసరం లేని వస్తువులు ఎక్కువగా ఉంటే వేడి అక్కడే నిలిచిపోతుంది. కాబట్టి ప్రతిరోజూ వంటగదిని శుభ్రం చేయాలి. అవసరమైన వస్తువులే ఉంచితే కిచెన్ విశాలంగా, చల్లగా అనిపిస్తుంది.
4. ఒకే పాత్రలో వంట చేయండి: పదేపదే గ్యాస్ స్టవ్ వెలిగించడం వల్ల వేడి మరింత పెరుగుతుంది. అందుకే వేసవిలో ఒకే పాత్రలో తయారయ్యే వంటకాలు చేయడం మంచిది. దీంతో గ్యాస్ కూడా తక్కువ ఖర్చవుతుంది, కిచెన్ వేడి కూడా తగ్గుతుంది.
5. తడి గుడ్డ వేలాడదీయండి: కిటికీ లేదా తలుపు దగ్గర కొద్దిగా తడి గుడ్డ వేలాడదీస్తే గాలి లోపలికి వచ్చేటప్పుడు చల్లగా మారుతుంది. ఇది సహజమైన, సులభమైన పద్ధతి.
6. మొక్కలు, లేత రంగులు ఉపయోగించండి: కిచెన్ కిటికీ దగ్గర చిన్న మొక్కలు ఉంచితే తాజాదనం ఉంటుంది. అలాగే లేత రంగు కర్టెన్లు లేదా బ్లైండ్లు ఉపయోగిస్తే సూర్యకిరణాల వేడి తక్కువగా ఉంటుంది.
మొత్తంగా వేసవిలో వంటగదిలో ఎక్కువసేపు ఉండడం ఇబ్బందికరమే. కానీ ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఏసీ, కూలర్ అవసరం లేకుండానే కిచెన్‌ను చల్లగా, సౌకర్యంగా మార్చుకోవచ్చు. దీంతో వంట పని కూడా సులభంగా.. మరింత దృష్టిసారించి పూర్తి చేసుకోవచ్చు..
తాజావార్తలు
-
FIFA World Cup 2026: మెక్సికో సంచలన విజయం.. నాకౌట్ దశలోకి తొలి అర్హత సాధించిన జట్టుగా.!
-
Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
-
PM Modi: నేటితో 56వ వసంతంలోకి రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ ఆసక్తికర పోస్ట్..
-
Instagram Love: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
-
Gold and Silver Prices Today: గోల్డ్, సిల్వర్ ధరలు ఢమాల్.. ఊహించని రీతిలో తగ్గినయ్
ట్రెండింగ్
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్‌కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్‌కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్‌కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!